బిగ్ బాస్ సీజన్ ఎంతో బోర్ గా మొదలవడం ఇదే మొదటి సారి. అయితే, చివరికి వచ్చేసరికి మాత్రం ఎక్కడలేని ట్విస్ట్ లను మోసుకొచ్చి అందరిని ఎంటర్టైన్ చేసింది ఈ షో. తొలుత సీజన్ ఫోరు పై ఎన్ని నెగటివ్ కామెంట్లు వచ్చినా.. చివరికి వచ్చేసరికి ఉత్కంఠభరితం గానే సాగింది. అసలు ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్ల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ల కన్నా నిన్నటి ఎపిసోడ్ చాలా హైలైట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని నిర్ణయాన్ని సోహైల్ తీసుకున్నాడు. టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ మనీ ఆఫర్ చేస్తారు. పాతిక లక్షలు తీసుకుని గేమ్ నుంచి తప్పుకోవచ్చు అంటూ ఆఫర్ చేస్తారు. అయితే, ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ గేమ్ నుంచి తప్పుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ, సోహైల్ మాత్రం అందుకు సిద్ధం అయ్యాడు.

అంతే కాదు, గేమ్ లో వచ్చిన పాతిక లక్షల్లో పది లక్షలు అనాధ ఆశ్రమానికి ఇస్తానని, ఐదు లక్షలు తన స్నేహితుడు మెహబూబ్ కి ఇస్తానని ప్రకటించడం తో అక్కడ ఎంతో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. సోహైల్ మాటలకు ఫుల్ హ్యాపీ అయిపోయిన చిరంజీవి కూడా అక్కడికక్కడే పది లక్షలు ఇస్తాను అంటూ చెక్ రాసి ఇవ్వడం మరో విశేషం. గతం లో ఏ సీజన్ లోను ఇలా జరగలేదు. మొత్తానికి గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గానే ముగిసింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. సోహైల్ టాప్ త్రీ పోసిషన్ లో ఉన్నట్లు మెహబూబ్ కి ముందే తెలుసు. అంతే కాదు, ఆ విషయాన్నీ మెహబూబ్ సోహైల్ కి ఫినాలే కి ముందు రోజే లీక్ చేసేసాడు కూడా.. నమ్మబుద్ది కావడం లేదా..? కావాలంటే ఈ వీడియో చూడండి. ఇందులో సోహైల్ కు మెహబూబ్ మూడు అని వేళ్ళతో చూపించడం, దానిని సోహైల్ చూడడం క్లియర్ గా కనిపిస్తోంది.

తనది మూడవ స్థానం అని సోహైల్ కు ముందే తెలిసిపోవడం తో, బిగ్ బాస్ గత సీజన్లలో ఆఫర్ చేసినట్లు ఈసారి ఆఫర్ చేస్తే, మనీ తీసుకుని గేమ్ నుంచి తప్పుకుందామని సోహైల్ ముందే ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ సోహైల్ టాప్ లో నిలిచినా, బిగ్ బాస్ యాభై లక్షలు ఇస్తారు. కానీ సోహైల్, అఖిల్ లు ముందుగానే ఓ మాట అనుకున్నారని వినికిడి. ఇద్దరిలో ఎవరు గెలిచినా వచ్చిన మొత్తాన్ని ఇద్దరు పంచుకోవాలనుకున్నారు. ఆ లెక్కన ఎలా చూసుకున్న సోహైల్ కి వచ్చేది పాతికలక్షలే. ఒకవేళ విన్నర్ కాకపొతే, ఏది రాకపోవచ్చు. దీనితో, రిస్క్ తీసుకోవడం ఎందుకు లే అనుకుని సోహైల్ పాతిక లక్షలు తీసుకుని గేమ్ నుంచి తప్పుకోవడానికి ముందుకొచ్చాడని బిగ్ బాస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి సోహైల్ కి మెహబూబ్ ముందే లీక్ చేసినట్లు తెలుస్తోంది. మెహబూబ్ వేళ్లను చూపించడం ఈ కింది వీడియో లో క్లియర్ గా కనిపిస్తుంది. అయితే, వచ్చిన డబ్బుని మెహబూబ్, సోహైల్ ఇద్దరు కూడా అనాధ ఆశ్రమానికి ఇవ్వాలనుకోవడం విశేషమే. వీరికి తోడు చిరంజీవి కూడా మరో పది లక్షలు ఇవ్వడం ఈ సీజన్ కె పెద్ద హైలెట్.
Mehaboob Leaked Sohel’s Position Yesterday that he is not the Winner?
So Today, Sohel preferred 25L instead of 2,3 places which he got from audience votes?#BiggBossTelugu4#BBTeluguGrandFinale pic.twitter.com/m75BK8sCpx
— Praneeth ? (@pranavpraneeth_) December 20, 2020
