Ads
సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రాన అలా వచ్చిన ప్రతి యాక్టర్ సక్సెస్ అవ్వాలి అని రూలేమీ లేదు. అలా కొంత మంది నటులు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 దాసరి అరుణ్ కుమార్
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కొడుకైన దాసరి అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని రిజిస్టర్ అవ్వగా ఇంకొన్ని విజయం సాధించలేదు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఒక్క క్షణం సినిమాలో విలన్ పాత్ర పోషించారు అరుణ్ కుమార్. ఆ తర్వాత శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు.
#2 ఆర్యన్ రాజేష్
దర్శకులు ఇవివి సత్యనారాయణ గారి కొడుకైన ఆర్యన్ రాజేష్ హాయ్, లీలామహల్ సెంటర్, సొంతం, ఆడంతే అదో టైపు, అనుమానాస్పదం, ఎవడి గోల వాడిదే, నిరీక్షణ, నువ్వంటే నాకిష్టం తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో సొంతం, ఎవడి గోల వాడిదే సినిమాలు విజయం సాధించాయి. 2019 లో విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ అన్నగా కనిపించారు ఆర్యన్ రాజేష్.
#3 గౌతమ్
బ్రహ్మానందం గారి కొడుకైన గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు, వారెవా, బసంతి లాంటి సినిమాల్లో నటించారు. 2018 లో విడుదలైన మను సినిమాలో నటించారు గౌతమ్.
#4 రమేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకైన రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత నటన నుంచి దూరమయ్యారు. మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు రమేష్ బాబు.
#5 విక్రమ్
ఎమ్మెస్ నారాయణ గారి కొడుకైన విక్రమ్ కొడుకు సినిమాతో హీరోగా అడుగుపెట్టారు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు విక్రమ్.
#6 అక్కినేని అఖిల్
అఖిల్, సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తర్వాత మనం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అఖిల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించారు. అఖిల్ తర్వాత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ ఇటీవల విడుదలైంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
#7 తారకరత్న
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న అమరావతి సినిమాతో విలన్ గా కూడా నటించారు. ఆ తర్వాత మనమంతా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యివేస్తే సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు తారకరత్న. తారకరత్న నటించిన S5 సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది.
#8 సుశాంత్
కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్ తర్వాత కరెంట్, ఆటాడుకుందాం రా, ఇంకా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిలసౌ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ప్రస్తుతం సుశాంత్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
#9 అల్లు శిరీష్
గౌరవం సినిమాతో హీరోగా అడుగు పెట్టిన అల్లు శిరీష్ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాల్లో నటించారు. అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. అల్లు శిరీష్ చివరిగా 2019 లో వచ్చిన ఏబిసిడి సినిమాలో కనిపించారు.
End of Article