Ads
వర్షాకాలం సీజన్లలో, వాతావరణం లో మార్పులు జరుగుతున్న సమయం లో సాధారణ జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. జనరల్ గా మనకు జ్వరం వచ్చినపుడు చాలా నీరసం గా ఉంటాం. రెండు రోజులు మితం గా ఆహరం తినడం, సరైన మందులు తీసుకోవడం వలన మళ్ళీ సాధారణ స్థితి కి వచ్చేస్తాం. జ్వరం గా ఉన్న సమయం లో మన శరీర ఉష్ణోగ్రత కూడా అధికం గా ఉంటుంది. అలంటి సమయం లో మనం నాన్ వెజ్ తినచ్చా? అనే అనుమానం చాలామందికి కలుగుతూనే ఉంటుంది.
Video Advertisement
సాధారణం గా జ్వరం ఎందుకు వస్తుంది. మన శరీరం లో ఏమైనా వైరస్ లు, బాక్టీరియా లు ప్రవేశించినపుడు మన శరీరం వాటిని బయటకు వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమం లో ఇన్ఫెక్షన్లను సోకకుండా ఉంచుకోవడానికి , ఇతర క్రిములను పెంచనివ్వకుండా ఉండడానికి శరీరం తన ఉష్ణోగ్రతని పెంచుకుంటుంది. ఈ సమయం లో జీర్ణక్రియ చాలా నిదానం గా ఉంటుంది. ఏమి రుచించవు. అయితే, చికెన్, మటన్, ఫిష్ లాంటి నాన్ వెజ్ వంటకాలను జ్వరం గా ఉన్న సమయం లో మనం తినలేము. అయితే, వాస్తవం గా నాన్ వెజ్ వంటకాలను, ఆయిల్ వంటకాలను జ్వరం గా ఉన్న సమయం లో తినకూడదు అని, వాటిని తినడం వలన పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉంటారు.
వీటిల్లో నిజం ఎంత ఉందొ తెలుసుకుందాం.. సాధారణం గా జ్వరం వచ్చిన వ్యక్తులకు చాలా నీరసం ఉంటుంది. శరీరం లో ఉండే రోగ నిరోధక శక్తీ బాక్టీరియా ను ఎదుర్కోవడం కోసమే పోరాడుతుంది. ఈ క్రమం లో శరీరం శక్తిని కోల్పోతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సమయం లో తేలిక గా జీర్ణం అయ్యే పదార్ధాలను ఆహరం గా తీసుకోవాల్సింది గా వైద్యులు సైతం సూచిస్తారు. సరిగా జీర్ణం కానీ మాంసాహారం, ఆయిల్ ఫుడ్స్ తినడం వలన అరుగుదల ఉండదు. ఈ సమయం లో లివర్ పై ఒత్తిడి పడుతుంది. ఫలితం గా పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే జ్వరం గా ఉన్న సమయం లో నాన్ వెజ్ ను, ఆయిల్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. జ్వరం గా ఉన్నపుడే కాదు, మాములుగా కూడా ఎక్కువ స్థాయి లో హోటల్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, విపరీతం గా మాంసాహారం తీసుకునే వారికి, అధికం గా మద్యం సేవించే వారికి లివర్ దెబ్బతింటుంది. ఫలితం గా పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
End of Article