Ads
మన దేశం లో గుర్తింపు కార్డు అనగానే మొదట గుర్తొచ్చేది ఓటర్ ఐడి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలా వీటి తో పాటు ఓటర్ ఐడి ని కూడా మనం గుర్తింపు కార్డు గా చుపిస్తాము. మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి అంటే కచ్చితం గా ఓటర్ ఐడి చూపించాల్సిందే. ఇప్పటి వరకు ఐడి కార్డులన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే వచ్చేవి. తాజాగా, కొత్త గా అప్లై చేసుకునే వారికి కలర్ ఓటర్ కార్డులను ప్రభుత్వం పంపిణి చేస్తోంది. మీకు కూడా కొత్త కలర్ కార్డులు కావాలా? మేము చెప్పినట్లు చేస్తే, మీకు కొత్త కలర్ కార్డు వచ్చేస్తుంది.
Video Advertisement
ప్రజలకు సౌకర్యం గా అందించడం కోసం.. ప్రభుత్వం ఆన్ లైన్ లోనే అప్లై చేసుకునే ఏర్పాటు చేసింది. ఇంట్లోంచి ఆన్ లైన్ లో నే అప్లై చేసుకుని ఓటర్ ఐడి ని పొందవచ్చు. మొదట ఆన్ లైన్ మీరు ఒక అప్లికేషన్ ను అప్లై చేసింది. కలర్ ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవడం కోసం మీరు https://voterportal.eci.gov.in పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ లో మీరు మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హోమ్ పేజీ కి వెళ్లిన తరువాత పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయండి.
ఈ పోర్టల్ లో అభ్యర్థులు తమ సమాచారాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సొంత ఫోటో ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే. ఒకసారి సబ్మిట్ చేసిన తరువాత ఈ మొత్తం సమాచారాన్ని అభ్యర్థులు సేవ్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త కార్డు కావాల్సిన వారు ఫారం 6 ను ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. దేశం లో ఎక్కడ నుంచి అయినా, ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోచ్చు. ఒకసారి అప్లై చేసిన తరువాత, మీ ప్రాంతం లో ఉండే బూత్ లెవెల్ అధికారి ఎన్నికల సంఘం తరపున మీ ఇంటికి వస్తారు. మీరు అందించిన సమాచారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని వెరిఫై చేస్తారు. ఆ తరువాత కలర్ ఓటర్ కార్డుని ఒక నెల రోజుల్లో మీ ఇంటికి పంపిస్తారు.
End of Article