Ads
బిగ్ బాస్ సీజన్ కు ఎంత పాపులారిటీ ఉందొ చెప్పక్కర్లేదు. బిగ్గెస్ట్ రియాలిటీ షో గా అనేక భాషల్లో ఈ షో ప్రసారం అవుతోంది. తెలుగు బిగ్ బాస్ షో ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంకా తమిళ బిగ్ బాస్ షో కొనసాగుతూ వస్తోంది. తమిళనాట బిగ్ బాస్ హౌస్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
Video Advertisement
బిగ్ బాస్ హౌస్ వేదికగా ఓ లేడీ కంటెస్టెంట్ ను ఆమె తల్లి చివాట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరం లోకి వెళితే, శివాని అనే తమిళ టి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తోంది. అయితే, ఆమె కోలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించి పాపులర్ అయ్యింది. అయితే, ఆమె హౌస్ లో ప్రవర్తిస్తున్న తీరుపై తమిళనాట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హౌస్ లో ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మరో వైపు టైటిల్ కి ఫేవర్ కంటెస్టెంట్ గా పేరు పొందిన ఆరి అనే కంటెస్టెంట్ తో ఆమె అస్తమానం గొడవలు పడడం కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు రుచించడం లేదు.
ఇది ఇలా ఉండగా, మరో వైపు బాలాజీ అనే కంటెస్టెంట్ తో ఆమె రొమాంటిక్ గా ఉంటోంది. ఆమె రొమాన్స్ మరీ శృతి మించడం తో తమిళ ప్రేక్షకులు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపధ్యం లో, బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ ల పేరెంట్ లను అనుమతించే అవకాశం కలిపించారు. ఈ సందర్భం గా శివాని తల్లి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. శివాని తల్లి అఖిల్ హౌస్ లోకి రాగానే, ఆమె బాగా ఎమోషనల్ అయిపొయింది. తల్లిని పట్టుకుని ఏడ్చేసింది. కొంతసేపు ఓదార్చిన శివాని తల్లి.. ఆ తరువాత ఆమె ను తిట్టడం మొదలు పెట్టింది.
బిగ్ బాస్ హౌస్ లో కి నువ్వు ఎందుకు వచ్చావ్..? కానీ ఏమి చేస్తున్నావ్? అంటూ మండిపడ్డారు. ఈ షో ని మన మిత్రులు, బంధువులు కూడా చూస్తారు. నీ ప్రవర్తన ఏమి బాగోవడం లేదంటూ ఆ తల్లి బిగ్ బాస్ వేదికపైనే తిట్ల దండకం అందుకుంది. అంతే కాకుండా, ఆరి తో ఎందుకు గొడవ పడుతున్నావ్..? ఆ అబ్బాయి చెప్పినట్లు విను అంటూ శివాని కి అక్షింతలు చల్లారు. ఓ వైపు ఇంకా చాలు ఆపు అంటూ శివాని ఎంత మొత్తుకున్నా… ఆమె తల్లి వినిపించుకోలేదు. బిగ్ బాస్ కెమెరాల లో ఆమె తల్లి తిట్టినా తిట్లన్నీ రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
watch video:
image credits : Disney Hotstar
End of Article