Ads
ప్రపంచంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది తల్లిదండ్రుల ప్రేమ అంటారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని, వారు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ కథ చదివితే నిజంగా తల్లిదండ్రుల ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అనే విషయం మళ్ళీ ఒకసారి రుజువవుతుంది. ఎండి కౌసర్ హుస్సేన్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ప్రమాదంలో కౌసర్ హుస్సేన్ తన కుడి చేతిని కోల్పోయారు.
Video Advertisement
తర్వాత నుంచి కౌసర్ హుస్సేన్ యాచించడం మొదలుపెట్టారు. అతనితో పాటు తన కూతురు కూడా వెళ్ళేది. కౌసర్ హుస్సేన్ తన కూతురిని స్ట్రీట్ సిగ్నల్ దగ్గర కూర్చోబెట్టి వెళ్తారు. తండ్రి వచ్చేంత వరకు కూతురు అక్కడే కూర్చుని ఎదురుచూస్తుంది. కౌసర్ హుస్సేన్ కూతురు తనతో వెళ్లడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే కౌసర్ హుస్సేన్ కూతురికి తన తండ్రికి ఏమైనా అవుతుందేమోనన్న భయం ఉంటుంది.
అందుకేే తను కూడా తండ్రితో పాటు వెళ్లి ఆయనని అని చూస్తూ ఉంటుంది. కౌసర్ హుస్సేన్ రెండు సంవత్సరాల పాటు కష్టపడి ఆ డబ్బులతో తన కూతురికిి డ్రెస్ కొందామని అనుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తన కూతురు కొత్త బట్టలు వేసుకోవడంతో తనతో పాటు బయటికి వెళ్లి ఆడుకోవాలి అనుకున్నారు కౌసర్ హుస్సేన్. తన భార్యకు చెప్పకుండా పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని తన కూతురిని ఫోటో తీశారు.
అప్పటివరకు తన కూతురుది ఒక్క ఫోటో కూడాా లేదు అని, ఆ రోజుని తనకి గుర్తుండిపోయేలా చేద్దామని అనుకున్నారని, ఒకరోజు ఫోన్ కొనుక్కున్నప్పుడు తన పిల్లల ఫోటోలు తీస్తానని, అవన్నీ తనకి మంచి జ్ఞాపకాలుగా పెట్టుకోవాలని ఉంది అని అన్నారు కౌసర్ హుస్సేన్. పిల్లలని స్కూల్ కి పంపించడం కష్టం అయినా కూడా వాళ్ళని పంపించి చదువు చెప్పిస్తున్నారు.
ఫీజులు కట్టడం ఆలస్యం అయినప్పుడు కొన్నిసార్లు వాళ్లు పరీక్షలకు అటెండ్ అవ్వలేకపోతారు. అందుకు కౌసర్ హుస్సేన్ “ఒక్కొక్కసారి పరీక్షలు మిస్ అవ్వచ్చు. కానీ జీవితం మనల్ని రోజూ పరీక్షించడమే పెద్ద పరీక్ష” అని చెప్తారట. ఈ విషయాన్ని జిఎంబీ ఆకాష్ అనే ఒక మల్టీ మీడియా జర్నలిస్ట్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.
End of Article