Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమంటే..డిసిప్లిన్ ఎక్కువ, లవ్లీ బాయ్, స్టైలిష్ బాయ్ ఇలా రకరకాల డెఫినిషన్లు చెప్పుకుంటూ పోతాం. పాపం సమంత కూడా ఇలానే అనుకుంది. సామ్ జామ్ షో కి రాకముందు వరకు ఇలానే అనుకుంది.. సామ్ జామ్ షో లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ బన్నీ గురించి రహస్యాలన్నీ పంచుకుని ఆ షో లో నవ్వుల పువ్వులు పూయించారు.
Video Advertisement
రియల్ లైఫ్ లో అల్లు అరవింద్ ఎంత సక్సెస్ అయ్యారో, తన కొడుకు బన్నీ సక్సెస్ ని చూసి అంతే ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు. పాత రోజుల్లో ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని బన్నీ అందిపుచ్చుకున్నారు. తక్కువ కాలం లోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. మెగా ఫామిలీ ఇమేజ్ తన పైన ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ అభిమానులకే స్టైలిష్ స్టార్ గా పిలిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బన్నీ కి కేరళ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇప్పుడు ఇంత హార్డ్ వర్కింగ్ గా ఉన్న బన్నీ చిన్నప్పుడు మాత్రం చాలా అల్లరి చేసేవాడట. టీచర్లను కూడా బెదిరించాడట. బన్నీ చిన్నప్పటి అల్లర్లని అల్లు అరవింద్ సామ్ జామ్ షో లో పంచుకున్నారు.
బన్నీ పదోతరగతి చదువుతున్న టైం లో ఒకసారి ఇంటికి ఫోన్ వచ్చిందట. ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తీసుకెళ్లాలంటూ టీచర్ అల్లు అరవింద్ కు చెప్పారట. సరే అని, బన్నీ ని తీసుకుని అల్లు అరవింద్ స్కూల్ కి వెళ్లగా, ఆ టీచర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పెట్టారట. మార్కులు చుస్తే అన్ని ఇరవై లు పాతిక లు తప్ప పెద్దగా మార్కులేమి రాలేదట. అల్లు అరవింద్ టీచర్ వైపు ఏమైనా చెప్పాలా? అన్నట్లు చుస్తే, ఆ టీచర్ కూల్ గా మీరు ఇక వెళ్ళచ్చు సార్ అన్నారట. అదేంటి ఇలా అంటున్నారు అని బన్నీ వైపు చుస్తే, బన్నీ కూడా పదండి నాన్న వెళదాం అన్నాడట. సరే అని అక్కడినుంచి వెళ్లిపోయారట. ఆ తరువాత, బన్నీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే.. బన్నీ ఆ టీచర్ కి ముందే ఫోన్ చేసి మాట్లాడాడట. “రేపు మా నాన్న వస్తారు. ఆయన్ని మీరేమి క్లాస్ లు పీకడానికి వీల్లేదు.. ఒకవేళ క్లాస్ పీకారో.. మీక్కూడా ఒక అమ్మాయి ఉంది.. నా లవ్ లో పడిపోవచ్చు.. చెప్పలేం..” అంటూ ఇండైరెక్ట్ గా బెదిరించారట. ఆయన్ని బ్లాక్ మెయిల్ చేయడం తో , బెదిరిపోయి అల్లు అరవింద్ వచ్చినపుడు ఏమి మాట్లాడలేదుట.
ఇలా బన్నీ చేసే అల్లరి పనుల గురించి అల్లు అరవింద్ సరదాగా పంచుకున్నారు. ఇంత అల్లరి పిల్లోడు పెద్దయ్యాక ఏమవుతాడు అని కంగారు ఉండేదని కూడా అల్లు అరవింద్ పంచుకున్నారు. ఇంకా ఈ తండ్రి కొడుకుల ముచ్చట్లు చూడాలంటే సామ్ జామ్ షో చూడాల్సిందే.
End of Article