Ads
ఇటీవల ఒక నటి చెప్పిన న్యూ ఇయర్ విషెస్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. తనే అభినయ. అభినయ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసిన వీడియో చూసినవారందరూ తనని ప్రశంసిస్తున్నారు. శంభో శివ శంభో, ఢమరుకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2 సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి ఎంతో గుర్తింపు సాధించారు అభినయ. అభినయకి మాట్లాడటంలో ఇబ్బంది ఉంటుంది.
Video Advertisement
తనకి రెండున్నర సంవత్సరాల వయసున్నప్పుడు వెస్ట్ మారేడ్ పల్లి లోని “ఓరల్ స్కూల్ ఫర్ ద డెఫ్” లో లిప్ రీడింగ్ సెషన్స్ తో స్కూలింగ్ మొదలుపెట్టారు. తర్వాత తార్నాకలోని సెయింట్ ఆన్స్ స్కూల్లో చదివారు. 2007 లో మస్తానా మస్తానా అనే షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటులు, దర్శకులు లారెన్స్, అభినయ గురించి మాట్లాడారు. అభినయ తండ్రి ఆనంద్ వర్మ ఒక ఎక్స్ సర్వీస్ మెన్. ఆనంద్ వర్మ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండేవారు.
నటన అవకాశం కోసం అభినయ ఫోటోలను ఫిలిం సర్కిల్ లో చూపిస్తూ ఉండేవారు. రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించిన సముద్రఖని ఒక మంచి దర్శకులు కూడా. సముద్రఖని, తను దర్శకత్వం వహించబోయే నాడోడిగళ్ సినిమా కోసం ఒక కొత్త నటిని వెతుకుతున్నారు. అదే సమయంలో మలయాళ దర్శకులు స్లీబా అభినయ పోర్ట్‌ఫోలియోను సముద్రఖని కి చూపించారు.
అభినయ గురించి తెలుసుకున్న సముద్రఖని తనని సినిమాకి ఎంచుకోవాలని ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నారట. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు అభినయ. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర పోషించారు అభినయ. నాడోడిగళ్ సినిమా తెలుగులో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ హీరోలుగా శంభో శివ శంభో గా రీమేక్ అయింది. ఈ సినిమాలో కూడా హీరో రవితేజకి చెల్లెలిగా నటించారు అభినయ.
అలాగే అయిరత్తిల్ ఒరువన్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో డబ్ అయింది. శంభో శివ శంభో ని కన్నడలో రీమేక్ చేశారు. అందులో కూడా అభినయ నటించారు. తర్వాత సెవెంత్ సెన్స్ సినిమాలో బోధిధర్మ భార్యగా నటించారు.
తెలుగులో దమ్ము, ఢమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధ్రువ, రాజు గారి గది 2 లో నటించారు. అలాగే మహంకాళి సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు అభినయ. తెలుగు, తమిళ్ సినిమాల్లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా కనిపించారు.
హిందీలో ధనుష్, అమితాబ్ బచ్చన్ హీరోలుగా వచ్చిన షమితాబ్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు అభినయ. ఇటీవల అభినయ న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్పి ఈ సంవత్సరం మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి మంచి పనులు చేయాలి అని ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
watch video :
https://www.youtube.com/watch?v=az6daszBZ-g
End of Article