Ads
ప్రతి సంవత్సరం ఒకే లాగా సినిమాలు రావు. ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు వస్తే, ఇంకొక సంవత్సరంలో తక్కువ సినిమాలు వస్తాయి. ఒక సంవత్సరం వచ్చిన సినిమాలు అన్ని హిట్ అవుతాయి. ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాలు అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు.
Video Advertisement
అలా మన హీరోలకు వరుసగా కొన్ని సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ తర్వాత అవన్నీ మర్చిపోయేలా బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మన హీరోల్లో కొంత మంది కం బ్యాక్ ఇచ్చిన సినిమాలో పోలీస్ పాత్ర పోషించారు. అలా తమ కం బ్యాక్ సినిమాల్లో పోలీస్ పాత్ర పోషించిన హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 పవన్ కళ్యాణ్
వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
#2 జూనియర్ ఎన్టీఆర్
రామయ్య వస్తావయ్యా, రభస సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
#3 మహేష్ బాబు
అతిధి, ఖలేజా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అప్పుడు 2011 లో మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
#4 రవితేజ
టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ తో సూపర్ హిట్ కం బ్యాక్ ఇచ్చారు రవితేజ.
#5 రామ్ చరణ్
2015 లో వచ్చిన బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తని ఒరువన్ రీమేక్ అయిన ధ్రువ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.
#6 బాలకృష్ణ
బాలకృష్ణ పోలీస్ గెటప్ లో కంబ్యాక్ ఇచ్చిన సినిమాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి. నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన భలేవాడివి బాసు, సీమ సింహం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమా హిట్ అయింది. ఇందులో బాలకృష్ణ డబుల్ రోల్ చేశారు. వారిలో ఒక బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. తర్వాత వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
#7 విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి. 2015 లో విజయ్ హీరోగా నటించిన పులి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలైంది. తర్వాత 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయాన్ని సాధించింది.
#8 బెల్లంకొండ సాయి శ్రీనివాస్
ఇది కం బ్యాక్ అని కాకపోయినా కూడా మొదటి హిట్ సినిమా చెప్పొచ్చు. అప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. రాక్షసుడు సినిమా కమర్షియల్ గా కూడా విజయం సాధించింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ గా నటించారు.
End of Article