Ads
ఎన్నో సంవత్సరాలుగా హీరోగా మనల్ని అలరిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు రాజశేఖర్. యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల సినిమాల్లో తనదైన స్టైల్ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1984 లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పుదుమై పెన్ తో సినిమా కెరీర్ మొదలు పెట్టారు రాజశేఖర్.
Video Advertisement
1985 లో వచ్చిన వందేమాతరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, దొర బిడ్డ, చల్లని రామయ్య చక్కని సీతమ్మ, తలంబ్రాలు, రేపటి పౌరులు, అరుణకిరణం, కాష్మోరా ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. వీటిలో కాష్మోరా రాజశేఖర్ కి మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత శృతిలయలు, ఆరాధన, స్టేషన్ మాస్టర్, బావమరుదుల సవాల్, మమతల కోవెల ఇలా ఎన్నో సినిమాలు చేశారు.
1989 లో వచ్చిన అంకుశం సినిమాతో ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు రాజశేఖర్. ఆ తర్వాత ధర్మ యుద్ధం, బలరామకృష్ణులు, ఆగ్రహం, అల్లరి ప్రియుడు, గ్యాంగ్ మాస్టర్, అన్న, రాజ సింహం, దీర్ఘ సుమంగళీభవ, శివయ్య, బొబ్బిలి వంశం, మా అన్నయ్య ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
2017 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పిఎస్వి గరుడ వేగ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు రాజశేఖర్. 2019 లో వచ్చిన కల్కి సినిమాలో రాజశేఖర్ చివరిగా కనిపించారు. ప్రస్తుతం అర్జున అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 1991 లో నటి జీవితని పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్. రాజశేఖర్ తమ్ముడు సెల్వ కూడా తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా గ్యాంగ్ మాస్టర్ సినిమాలో నటించారు. అలాగే గోల్మాల్, 12-12-1950 అనే రెండు తమిళ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
అలాగే జీవిత సోదరి కూడా నటే. జీవిత చెల్లెలు అయిన ఉమ కూడా తెలుగులో నటించారు. కానీ కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించారు ఉమ. రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శివాని రాజశేఖర్ నటించిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (WWW) టీజర్ ఇటీవల విడుదలైంది. చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
End of Article