పుట్టి ఇరవై నెలలు కూడా కాలేదు..అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.! చనిపోతూ 5 గురి ప్రాణాలను నిలబెట్టింది..!

పుట్టి ఇరవై నెలలు కూడా కాలేదు..అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.! చనిపోతూ 5 గురి ప్రాణాలను నిలబెట్టింది..!

by Anudeep

Ads

అవయవదానాల గురించి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాక కూడా అతని శరీరం లో కొన్ని అవయవాలు నిర్ణిత సమయం వరకు పని చేయగలిగే స్థితిలోనే ఉంటాయి. వీటిని వెంటనే వేరు చేసి..అవసరం అయిన వారికి అందించగలగడం ద్వారా వారి ప్రాణాలను కాపాడచ్చు. అలా, పుట్టి ఇరవై నెలలు కూడా పూర్తి కానీ ఓ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. అయితే, ఆమె తల్లి తండ్రులు ఆ చిన్నారి మృతి చెందిన కష్టకాలం లో కూడా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

Video Advertisement

20 month old baby

ఆ చిన్నారి అవయవాలని మరో ఐదుగురికి దానం చేసారు. దేశం లో అత్యంత పిన్న అవయవదాత గా ఈ పాప నిలిచింది. వివరాల్లోకెళ్తే, ఈ పాప పేరు ధనిష్తా. తన ఆట పాటలతో ఎంతో సందడి చేసేది. కానీ, అర్ధాంతరం గా ఇలా అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఎవరు ఊహించలేదు. ఈ నెల 8 న ఈ చిన్నారి బాల్కనీ పై నుంచి పడిపోయింది. ఈ నెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఆ తల్లి తండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ పాప అవయవాలను దానం చేయాలనుకుంటున్నట్లు వారు తెలిపారు.

20 month old baby

ఆ సమయం లో అవయవాల కోసం ఎదురు చూస్తున్న పలువురు వ్యక్తులను కలిసినట్లు ఆ పాప తండ్రి ఆశిశ్ కుమార్ తెలిపారు. ఆ పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను మరో ఐదుగురికి దానం ఇచ్చినట్లు ఆశిష్ కుమార్ తెలిపారు. తమ పాప తమ మధ్య లేకపోయినా.. ఆ ఐదుగురిలోను బతికే ఉంటుందని వారు ఆవేదనగా చెప్పారు. ఇరవై నెలల వయసు లోనే ధనిష్త అందరిని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఆ ఐదుగురిలో మాత్రం ఆమె జీవం మిగిలే ఉంటుంది. పాప చనిపోయిన దుఃఖం లో ఉండి కూడా, ఆ పాప తల్లి తండ్రులు ఎంతో ఔదార్యాన్ని కనబరిచారు. ప్రస్తుతం ఈ పాప జీవిత గాధ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎందరో నెటిజన్లు ఆ పాప తల్లితండ్రులను ప్రశంసిస్తున్నారు.


End of Article

You may also like