Ads
ఇటీవల ఆహాలో విడుదలై సూపర్ హిట్ అయిన సిరీస్ మెయిల్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మెయిల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించారు గౌరి ప్రియా రెడ్డి. గౌరి ప్రియ బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చదివారు. తండ్రి పేరు శ్రీనివాస్ రెడ్డి తల్లి పేరు వసుంధర. గౌరి ప్రియ మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్నారు.
Video Advertisement
గౌరి ప్రియ మంచి సింగర్ కూడా. ఎన్నో సంవత్సరాలు కర్ణాటక సంగీతంలో, అలాగే లలిత సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచారు. జెమినీ టీవీ లో కొంతకాలం యాంకరింగ్ కూడా చేశారు. బోల్ బేబీ బోల్ ప్రోగ్రాం లో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచారు.
ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి స్టేజ్ షోస్ కూడా ఇచ్చారు. తేజ దర్శకత్వంలో వచ్చిన హోరాహోరీ సినిమాలో ఒక పాట పాడారు. నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో నటించారు. అలాగే చాయ్ బిస్కెట్ వాళ్ల గర్ల్ ఫార్ములా వీడియోస్ లో కూడా నటించారు. మెయిల్ లో లీడ్ రోల్ లో కనిపించారు.
watch video:
https://youtu.be/TieG3zoDpo4
ఇటీవల సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌరి ప్రియా రెడ్డి మాట్లాడుతూ, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని, తన తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పారు. మెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ “నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. పల్లె వాతావరణం అసలు తెలియదు. కానీ షూటింగ్ కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లాం.
మహబూబాబాద్ లోని గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ లో దాదాపు నెలన్నర రోజుల వరకు ఉన్నాం. ఇప్పటివరకు నేను అసలు హాస్టల్ లో ఉండలేదు. అక్కడే చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా చూశాను. అక్కడ పొలాల్లో పని చేసే అమ్మాయిలతో, ఊర్లో నివసించే పెద్ద వారితో మాట్లాడి ప్రభుత్వ పథకాల గురించి వ్యవసాయం గురించి శ్రద్ధగా వినే దాన్ని.
కరోనా సమయం కావడంతో నేను నా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. షూటింగ్ కి నేను ఒక్కదాన్నే వెళ్లాను. నాతో పాటు ఒక హెయిర్ డ్రెస్సర్ అమ్మాయి ఉంది. మిగిలిన వారు అంతా మగవారే. కానీ మాకు ఎక్కడ అసౌకర్యం అనిపించలేదు, భయం కలగలేదు.” అని చెప్పారు.
End of Article