Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో డార్లింగ్ సినిమా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. సినిమా వచ్చి దాదాపు పది సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ డార్లింగ్ సినిమాకి చాలా క్రేజ్ ఉంటుంది.
Video Advertisement
అప్పటివరకు ప్రభాస్ ని యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో చూసిన ప్రేక్షకులకి ప్రభాస్ కి లవ్ స్టోరీస్ కూడా సూట్ అవుతాయి అని రుజువు చేసిన సినిమా ఇది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కూడా డిఫరెంట్ గా అనిపించింది. ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండడంతో డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ తమ్ముడిగా నటించిన అబ్బాయి అందరికీ గుర్తుండే ఉంటాడు. అతని పేరు గౌరవ్.
Gaurav in Darling
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో గౌరవ్ పర్ఫామెన్స్ ఒక హైలెట్ గా నిలిచింది. గౌరవ్ డార్లింగ్ సినిమాలో మాత్రమే కాకుండా శ్రీరామరాజ్యం సినిమాలో కూడా నటించాడు. గౌరవ్ కి చిన్నప్పటినుంచి యాక్టింగ్, డాన్స్ అంటే ఇష్టమట. చిన్నప్పుడు ఎన్నో స్టేజ్ షోస్ కూడా ఇచ్చాడు.
Gaurav in Shadow
గౌరవ మొదటి సరిగా నందితా దాస్ దర్శకత్వంలో వచ్చిన ఒక డాక్యుమెంటరీలో నటించాడు. ఈ సినిమా పేరు ఫిరాక్. తర్వాత రవితేజ హీరోగా నటించిన బలాదూర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. గౌరవ్ ఇరవైకి పైగా సినిమాల్లో నటించాడు.
Gaurav in Spyder
మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా మహేష్ బాబు తమ్ముడి గా నటించాడు గౌరవ్. గౌరవ్ ఒక ఇంటర్వ్యూలో తనకు హీరో అవ్వాలి అని ఉంది అని చెప్పాడు. ఇటీవల తేజ, ఇంకా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. గౌరవ్ కూడా అలానే ఒక మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వాలని ఆశిద్దాం.
End of Article