Ads
ఒక్కరోజు సీఎం.. ఒక్కరోజు లో ఏమి చేస్తాం అని అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి జీవితం లో అద్భుతం గా గడిపాము అని అనుకోవడానికి కొన్ని క్షణాలు చాలు. సినిమాలలో అయితే, ఒక్కరోజు సీఎం (ఒకే ఒక్కడు), ఒక్కరోజు పవర్ ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ (రేసుగుర్రం).. ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు హీరోలు ఇరగదీసేస్తుంటారు. అదే నిజ జీవితం లో అంత కాకపోయినా కొంత ఇరగదీయొచ్చు అని ఈ అమ్మాయి ప్రూవ్ చేసింది. ఇంతకీ ఆ ఒక్క రోజు సీఎం గారి కథ ఏంటో తెలుసుకుందాం.
Video Advertisement
ఉత్తరాంఖండ్ రాష్ట్రము లో నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భం గా హరిద్వార్ కు చెందిన సృష్టి గోస్వామి అనే అమ్మాయి ని ఒక్కరోజు సీఎం గా ఎంపిక చేసారు. ఉత్తరాంఖండ్ రాష్ట్ర వేసవి రాజధాని గా ఉన్న గైర్ సేయిన్ నగరం నుంచి ముఖ్యమంత్రి హోదా లో ఆమె పరిపాలన బాధ్యతలను ఒక్కరోజుకు స్వీకరించారు. ఆ ఒక్క రోజులోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుతున్న పలు పధకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుంది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం అయ్యి రాష్ట్రము లో శాంతి భద్రతల గురించి తెలుసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ లో మూడు గంటల పాటు నిర్వహించే మాస్ అసెంబ్లీ సభలలో కూడా పాల్గొంది. ఈ సమయం లో ప్రస్తుతం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావంత్ ఆమెకు సలహాలను, సూచనలను అందించారు.
సృష్టి గోస్వామి హరిద్వార్ లో దౌలత్ పూర్ కు చెందిన అమ్మాయి. ఆమె ప్రస్తుతం అగ్రికల్చరల్ బిఎస్సి చదువుతోంది. ఆమె తండ్రి ప్రవీణ్ గోస్వామి. కుటుంబ పోషణార్ధం ఆయన కిరానా షాపు నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి సుధా గోస్వామి. ఆమె కూడా అంగన్ వాడి వర్కర్ గా పని చేస్తున్నారు. సృష్టి సామాజిక కార్యకలాపాల పట్ల చాలా ఆసక్తి గా ఉంటారు.
ఆమె 2018 లోనే బాలల అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహించింది. ఒక్కరోజు సీఎం గా అవకాశం రావడంతో ఆమె ఆనందానికి హద్దు లేదు. ఆ అవకాశం ఇచ్చిన త్రివేంద్ర సింగ్ కు ధన్యవాదాలు కూడా చెప్పుకుంది.
End of Article