Ads
బాహుబలి తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకం గా రూపొందిస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. అందులోను రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, అలియా భట్ తో పాటు బ్రిటిష్ నటి ఒలీవియా కూడా నటిస్తోంది అనేసరికి అభిమానుల ఎక్సపెక్టషన్స్ ఏ రేంజ్ కి రీచ్ అయిపోయి ఉంటాయో చెప్పలేం. ఇటీవలే ఒలీవియా పుట్టిన రోజు సందర్భం గా ఆమె పాత్ర పేరుతొ ఆమె లుక్ ను “ఆర్ ఆర్ ఆర్” టీం విడుదల చేసింది.
Video Advertisement
ఈ సినిమా లో ఆమె జెన్నిఫర్ గా కనిపించనున్నారు. ఈ పాత్రలో ఆమె ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ నటి ఒలీవియా నటిస్తున్నారు. “ఆర్ ఆర్ ఆర్” లో ఆమె బ్రిటిష్ అమ్మాయి జెన్నిఫర్ గా కనిపించనున్నారు. ఈ పాత్రలతో పాటు సముద్రఖని, శ్రీయ, అజయ్ దేవగన్, అలిసన్ డుడి కూడా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. అక్టోబర్ 13 న దసరా కానుక గా ఈ సినిమా విడుదల కానుందని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటన కూడా చేసేసింది.
అయితే, జెన్నిఫర్ ఫోటో ను రిలీజ్ చేయగానే, ఒలీవియా తన ఇంస్టాగ్రామ్ ఖాతా లోని ఓల్డ్ ఫోటోలను డిలీట్ చేసేసిందట. ఉన్నట్లుండి ఎందుకు డిలీట్ చేసేసింది అని అందరు చర్చ చేస్తున్నారు. ఆమె గతం లో చాలా బోల్డ్ గా ఉండేదట. ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఒప్పుకోకముందు.. ఆమె బోల్డ్ ఫోటోస్ తో తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ పిక్స్ షేర్ చేసేది. ఆమె అందాల ఆరబోతతో రెచ్చిపోయేది.
ఆర్ ఆర్ ఆర్ కి ఒప్పుకున్నాక రాజమౌళి టీం కండిషన్స్ మేరకు ఆ ఫోటోలను డిలీట్ చేసిందని తెలుస్తోంది. ఆమె బోల్డ్ ఫోటోల ప్రభావం ఆర్ ఆర్ ఆర్ లో జెన్నిఫర్ పాత్రపై పడే అవకాశం ఉందని అందుకే ఆ ఫోటోలు డిలీట్ చేసిందని తెలుస్తోంది. అయితే, ఆమె బర్త్ డే సందర్భం గా జెన్నిఫర్ లుక్ ని రిలీజ్ చేయడం తో.. ఆమె అందాన్ని చూసి ఆమె ఫోటోలను సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరు ట్రేండింగ్ లో ఉంటోంది. దాదాపు రెండు లక్షలకు పైగా సినీ అభిమానులు ఆమె పేరుని సెర్చ్ చేశారట. ఒలీవియా మ్యూజిక్ అండ్ డ్రామా కోర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిందట. అంతకుముందు పలు హాలీవుడ్ షోస్ లో కూడా కనిపించింది.
End of Article