Home Filmy Adda రోడ్డు ప్రమాదం బారిన పడ్డ “సలార్” యూనిట్..!

రోడ్డు ప్రమాదం బారిన పడ్డ “సలార్” యూనిట్..!

by Anudeep

ఈరోజు సాయంత్రం సమయం లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఇంకా మరవకముందే మరో ప్రమాదం జరిగింది. సలార్ చిత్ర యూనిట్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై యు టర్న్ తీసుకుంటున్న సమయం లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

salar 1

యూనిట్ సభ్యులు ఉన్న వ్యాన్ లారీ ని ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో సలార్ యూనిట్ సభ్యులు గాయపడడం తో వీరిని వెంటనే మమతా ఆసుపత్రి కి తరలించారు. అయితే కంగారు పడక్కర్లేదని, స్వల్ప గాయాలే తగిలాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

You may also like