Home Filmy Adda పవన్ – క్రిష్ చిత్రానికి టైటిల్ ఇదేనా..?

పవన్ – క్రిష్ చిత్రానికి టైటిల్ ఇదేనా..?

by Anudeep

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే వరుస సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా లలో రీ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక పవన్ జోరు పెంచారు. కరోనా కారణం గా సినిమా షూటింగ్ లు ఆలస్యమైనప్పటికీ తిరిగి వేగం పెంచారు. ఇప్పటికే, వకీల్ సాబ్ షూట్ ను కంప్లీట్ చేసిన పవన్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.

pavan

క్రిష్ దర్శకత్వం లో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారట. అయితే, ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి ప్రకటన చేయలేదు. ఇది పవన్ కు 27 వ సినిమా కానుంది. పవన్ – రానా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు ఈ సినిమా రీమేక్.

You may also like