Ads
అభిమానులన్నాక తల తిక్క ప్రశ్నలేసేవాళ్ళు కూడా ఉంటారు అని అప్పుడప్పుడు నిరూపణ అవుతూ ఉంటుంది. సెలెబ్రిటీలు అన్నాక అప్పుడప్పుడు అభిమానులతో టచ్ లోకి వస్తుంటారు. అభిమానులు కూడా వారు ఎప్పుడు లైవ్ లోకి వస్తారా.. వారితో ఓ సారి ముచ్చటిద్దాం అని సంబరపడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇబ్బంది కర ప్రశ్నలు ఎదురైనప్పుడే.. సెలెబ్రిటీలు.. ముఖ్యం గా హీరోయిన్లు పైకి చెప్పలేని విధం గా ఫీల్ అవుతారు. అలా అని రూడ్ గా బిహేవ్ చేయలేరు.
Video Advertisement
అలాంటి పరిస్థితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కు కూడా ఎదురయ్యింది. ఇటీవల ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి కొంతసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ సమయం లోనే ఓ అభిమాని ఆమెను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటో ను పెట్టమని కోరగా ఆమె పూల బికినీ లో స్విమ్ చేస్తున్న ఫోటో ను పెట్టింది.
మరో అభిమాని అరవింద సమేత వీర రాఘవ సినిమా సెట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో ను పెట్టాలని కోరాడు. ఆమె జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ తో దిగిన ఫోటో ను పెడుతూ “జూనియర్ జూనియర్ ఎన్టీఆర్” అంటూ కాప్షన్ ను జత చేసింది. ఆమె వరుస గా ఫోటో లు పెడుతుండడం తో మరో అభిమాని న్యూడ్ ఫోటో పెట్టాలంటూ కోరాడు.
దానికి బదులు గా ఆమె పాదాల ఫోటోను తీసి పెట్టింది. ఆమె సమయ స్ఫూర్తి కి అందరు మెచ్చుకున్నారు. ఆ నెటిజెన్ ఆ రిప్లై కి సైలెంట్ అయిపోయాడు. రూడ్ గా ప్రవర్తించకుండా పూజ చాలా తెలివి గా రిప్లై ఇచ్చిందంటూ కితాబులిస్తున్నారు. హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురయ్యేవే.. వారు ఎంత సమయస్ఫూర్తి తో వ్యవహరిస్తారనేది వారి పై అభిమానాన్ని మరింత పెంచుతూ ఉంటుంది.
End of Article