Ads
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “నేను శైలజ”. కీర్తి సురేష్ అంతకుముందు తెలుగులో వేరే సినిమాలో నటించినా కూడా ఈ సినిమా ముందు విడుదల అయ్యింది. దాంతో తెలుగులో కీర్తి సురేష్ మొదటి సినిమా నేను శైలజ అయ్యింది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
Video Advertisement
కిషోర్ తిరుమల తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన రఘువరన్ బీటెక్ సినిమాకి డైలాగ్స్ రాశారు. నేను శైలజ సినిమా తర్వాత రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ సినిమాలు వచ్చాయి. ఇంక నేను శైలజ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి నటీనటుల పెర్ఫార్మెన్స్ తోపాటు డైలాగ్స్, ఇంకా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే, నేను శైలజ సినిమాలో షూటింగ్ పని మీద హీరోయిన్ గోవా కి వెళ్తుంది. హీరో కూడా తనతో పాటు గోవా కి వెళ్తాడు.
అప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాటలో హీరో, హీరోయిన్ ఒక బైక్ మీద వెళ్ళడం చూపిస్తారు. ఒక షాట్ లో బైక్ నెంబర్ GA 07 J 7919 ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అదే బైక్ నెంబర్ GA 03 AA 5996 అని ఉంటుంది. ఈసారి చూసినప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి.
watch video:
End of Article