Ads
కొందరు జాతకాల్లో ఇలా జరగాలి అని ముందే రాసిపెట్టి ఉంటుందో ఏమో.. అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఎవరికీ ఏ విధం గా అదృష్టం తగులుతుందో చెప్పడం చాలా కష్టం. కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు కలిసి వస్తే అదృష్టవంతులు అయిపోతారు. అలంటి స్టోరీ నే ఇది కూడా. రాత్రికి రాత్రి ఓ వ్యక్తి ఎలా కోటీశ్వరుడు అయిపోయాడో చూడండి..
Video Advertisement
ఆంటోనీ డోవ్ అనే వ్యక్తి నార్త్ కరోలినా లో నివసిస్తున్నాడు.ఓ రోజు అతను కొత్త కారుని కొనుక్కుని ఇంటికి తీసుకుని వస్తున్నాడు. అదే సమయం లో రోడ్డుకి అడ్డం గా జింకలు వచ్చాయి. హై వే రోడ్డు కావడం తో అతను కారుని చాలా వేగం గా నడపుతుండడం తో బ్రేక్స్ తో కారుని అదుపు చేయలేకపోయాడు. జింకలను ఢీకొట్టేసాడు. అటు జింకకి బాగా గాయాలు అయ్యాయి.. ఇటు కొత్త కారు కూడా బాగా డామేజీ అయింది. ఆరోజు అతనికి చాలా విచారం వేసింది. కానీ తెల్లారితే అతను శుభవార్త వినబోతున్నాడని అతనికి తెలియదు.
ఆ మరుసటి రోజు ఉదయం అతను కొన్న లాటరీ టికెట్ కి ప్రైజ్ మనీ వచ్చిందని తెలిసింది. దాదాపు వన్ మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అతనికి లభించింది. ఆ ఆనందం లో అక్కడే అతను మరొక టికెట్ ను కొనుగోలు చేసాడు. దానికి కూడా ప్రైజ్ మనీ లభించింది. మొత్తం రెండు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అతన్ని వరించింది. అందులో పన్నులు పోగా.. దాదాపు 10.2 కోట్ల రూపాయలు అతనికి లభించాయి. ఈ డబ్బు తో డోవ్ తన కారు కి రిపేర్ పనులు, తన తల్లి తండ్రుల ఇంటికి రిపేర్ పనులు చేయిస్తానని ఆనందం గా తెలిపాడు.
End of Article