Ads
అదో పేరున్న కాలేజీ. ఈ కాలేజీని 1850 లో బ్రిటిషర్లు స్థాపించారు. అదే సెయింట్ జాన్స్ కాలేజీ. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో ఈ కాలేజీ ఉంది. ఈ కాలేజీ యాజమాన్యం వాలంటైన్స్ డే దగ్గిర పడుతున్న నేపధ్యం లో బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజ్ కి రావాలంటూ అమ్మాయిలకి సర్క్యులర్ పంపినట్లుగా ఉన్న ఒక లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని వెనుక స్టోరీ ఏంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
Video Advertisement
ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న సర్క్యులర్ ప్రకారం అమ్మాయిల సేఫ్టీ ని దృష్టిలో ఉంచుకుని.. వాలంటైన్స్ డే రోజు బాయ్ ఫ్రెండ్ తోనే కాలేజీ కి రావాలంటూ సెయింట్ జాన్స్ కాలేజీ యాజమాన్యం పేర్కొన్నట్లు ఉంది. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ను తీసుకు రావడం వీలు కాలేకపోతే తమకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లుగా రుజువు చేస్తూ ఒక ఫోటో ను అయినా చూపించాలని పేర్కొన్నారు. చివరలో.. అమ్మాయిలు ప్రేమను పంచండి అంటూ ఆ సర్క్యులర్ లో పేర్కొనడం గమనార్హం.
representative image
ఈ సర్క్యులర్ నెట్టింట్లో వైరల్ అవుతుండడం తో ఆ కాలేజీ లో చదువుతున్న విద్యార్థినుల తల్లి తండ్రులు కాలేజి యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రశ్నించారు. దీనితో, ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం ఇది ఫేక్ సర్క్యులర్ అంటూ వివరణ ఇచ్చింది. ఎవరో కాలేజీ పరువు తీయడం కోసమే ఇలాంటి పని చేసారని, కచ్చితం గా వారి పై చర్యలు తీసుకుంటామని సదరు యాజమాన్యం పేర్కొంది. ఈ పని ఎవరు చేసారో ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యం ఇప్పటికే ఫిర్యాదు చేసింది. యాజమాన్యం ఈ ఫేక్ సర్క్యులర్ పై వివరణ ఇచ్చినప్పటికీ ఇది ఇంకా వైరల్ అవుతూనే ఉంది. పలువురు నెటిజన్లు దీనిని చూసి ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.
End of Article