Ads
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళికి ప్రేమకి దూరం గా ఉంటున్నట్లు కనిపిస్తూ… దాదాపు పదేళ్ల పాటు తన ప్రేమ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఉన్నట్లుండి.. తన లవ్ స్టోరీ ని రివీల్ చేసేసి, తన ప్రియుడు గౌతమ్ చేత మూడు ముళ్ళు వేయించేసుకుంది. అంతా చాలా సడన్ గా జరిగిపోయినా, మొత్తానికి తన ప్రేమను నిలబెట్టుకోవడం తో ఫ్యాన్స్ కూడా హ్యాపీ అయ్యారు. సడన్ గా పెళ్లి అనేసరికి హర్ట్ అయినా.. పెళ్లి తరువాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తోంది కాబట్టి కాజల్ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నారు.
Video Advertisement
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ “ఆచార్య” లో చిరు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. కమలహాసన్ తో పాటు “ఇండియన్ – 2 ” సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కాకుండా హిందీ లో మరో చిత్రాన్ని చేస్తోంది. ఇటీవల పెళ్లి తరువాత మాల్దీవుల్లో హాట్ ఫొటోస్ తో మెస్మరైజ్ చేసిన కాజల్..
తాజాగా తన లవ్ స్టోరీ లోని సీక్రెట్స్ ని ఇప్పుడిప్పుడే రివీల్ చేస్తోంది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కారించారన్న సంగతి విదితమే. ఈ విగ్రహం ఆవిష్కరించి నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ విగ్రహ ఆవిష్కరణ రోజు.. కాజల్ తో పాటు కాజల్ ఫామిలీ మెంబెర్స్ కూడా హాజరు అయ్యారు.
ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయినా సంగతి తెలిసిందే. అందరికి తెలియని విషయం ఏమిటంటే.. కాజల్ మైనపు విగ్రహం ఆవిష్కరణ రోజు కంటే ఒకరోజు ముందే గౌతమ్ అక్కడకు చేరుకున్నాడు. ఆ మైనపు బొమ్మని తిలకించి, అక్కడే కాజల్ తో గడిపాడు. ఈ ఇద్దరు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ తరువాత బిజినెస్ పని మీద గౌతమ్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. దీనితో ఈ విషయం మీడియా కి కూడా తెలియలేదు. తాజాగా, ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
End of Article