Ads
అక్కినేని అఖిల్ ఇప్పుడు హీరో గా టాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్నారు. అయితే, అఖిల్ చిన్నవయసు లోనే ఓ సినిమా లో నటించారు. పాలు తాగే వయసు లో ఆయన చేత నటింపచేసి.. ఆ సినిమా ను సూపర్ హిట్ చేసారు. ఈ సినిమా లో నాగార్జున కూడా ప్రధాన పాత్ర పోషించారు. 1995 సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదలయింది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.
Video Advertisement
“బేబీస్ డే అవుట్” అనే ఇంగ్లీష్ సినిమా ను స్ఫూర్తి గా తీసుకుని శివ సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పై చేసిన నాగేశ్వరరావు సిసింద్రీ సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే ఆరు కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఓ మ్యాగజైన్ లో అమలతో పాటు ఉన్న అఖిల్ ఫోటో ను చూసి ఈ సినిమా లో అఖిల్ నే తీసుకోవాలని నాగేశ్వరావు అనుకున్నారట. అయితే అందుకు మొదట అమల ఒప్పుకోలేదట. ఆయన నాగార్జున ను సంప్రదించగా.. నాగ్ కూడా చాలా ఆలోచించి ఆ తరువాత ఒప్పుకున్నారట.
ఈ సినిమాలో నటించిన టబు, పూజాబత్రా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారట.ఈసినిమా లో అఖిల్ కు తల్లి తండ్రులు గా ఆమని, శరత్ బాబు నటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమని నటించిన తల్లి పాత్రను అమల చేయాల్సి ఉంది. అయితే, అమల అందుకు ఒప్పుకోకపోవడం తో ఈ సినిమాలో ఆమని నటించింది. ఓ సన్నివేశం లో అఖిల్ ఆమని వైపు చూస్తూ ఏడవాల్సి ఉంది. అయితే..ఎంత సేపు చూసినా అఖిల్ ఏడవలేదట. దీనితో, అమల కారులో వెళ్ళిపోతున్నట్లు ఆఫ్ ది కెమెరా చేసారు. అది చూసి అఖిల్ ఏడవడం మొదలుపెట్టాడట.
ఈ సినిమా ను సారధి, రామానాయుడు, పద్మాలయ స్టూడియోలలో సెట్ లు వేసి రూపొందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా కోసం కోటి యాభై లక్షలు ఖర్చు చేసారు. డెబ్భై ఐదు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమా కి గాను అఖిల్ నటన కు నాలుగు అవార్డు లు రావడం విశేషం. మొత్తానికి మన అయ్యగారు పాలు తాగే వయసు లోనే నాలుగు అవార్డులు సాధించేశారన్నమాట.
End of Article