Ads
బుల్లి తెర పై వచ్చే టివి షో లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. ఈ షో లో నటించే యాంకర్లు ఎంతో సరదాగా జోక్స్ వేస్తూ ఉంటారు. తెరపై వీరు ఎంత సరదాగా ఉంటారో తెర వెనుక కూడా వీరు అంతే సరదాగా ఉంటారు. వీరి మధ్య స్నేహం ఎక్కువ సార్లు కొనసాగుతూ ఉంటుంది. కొన్ని సార్లు వీరి కుటుంబాల మధ్య కూడా అంతే సాన్నిహిత్యం ఉంటుంది. అలా సన్నిహితం గా ఉండేవారిలోనే వర్షిణి, యాంకర్ రవి కూడా ఉన్నారు.
Video Advertisement
వీరిద్దరూ కలిసి పటాస్ షో చేసారు. ఈ షో లో మొదలైన వీరి స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల యాంకర్ రవి చేసిన ఓ ఇంటర్వ్యూ కి వర్షిణి తన అక్కని కూడా తీసుకొచ్చింది. దీనిని బట్టి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ లో వర్షిణి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ ఇంటర్వ్యూ లో హైలైట్ గా నిలిచింది.
తాజాగా, యాంకర్ రవి వర్షిణి తో చేసిన చాట్ ను వర్షిణి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ వాయిస్ మెసేజ్ పంపిన రవి కి వర్షిణి ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఆ తరువాత హై హీల్ వేసుకోవద్దు ప్లీజ్ అంటూ రవి మరో సందేశాన్ని పంపాడు. దానికి ఇన్ స్టా లో పెట్టేస్తా అంటూ వర్షిణి రిప్లై ఇచ్చింది. వెంటనే ఆ చాట్ ని ఇన్ స్టా లో అప్లోడ్ చేసింది.
షార్ట్ గర్ల్స్ కష్టాలు అంటూ టాగ్ లైన్ పెట్టింది. దానికి యాంకర్ రవి రివర్స్ కౌంటర్ వేసాడు. ని యంకమ్మ నిజం గానే పెట్టేశావా.. రేపు ఎంట్రీ లో సాంగ్ చేయాలి అందుకే హై హీల్స్ వద్దు అని చెప్పా.. నీకు ఇలా అర్థమైందా..? అంటూ రిప్లై ఇచ్చాడు.
End of Article