వైరల్ అవుతున్న ఈ ఫోటో ఏ టాలీవుడ్ హీరోయిన్ దో చెప్పగలరా..?

వైరల్ అవుతున్న ఈ ఫోటో ఏ టాలీవుడ్ హీరోయిన్ దో చెప్పగలరా..?

by Anudeep

Ads

ఈ చిన్న పాప ఫోటో చూడగానే.. ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా.. సరిగ్గా చూడండి నివేద థామస్ ఫోటో అండి ఇది. తెలుగునాట చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. నివేద థామస్ సినీ ఇండస్ట్రీలోకి చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది.

Video Advertisement

నివేద ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో ఎక్కువ గా తమిళ్, మలయాళం సినిమాలలో నటించింది. “వెరుతు ఓరు భార్య” అనే మలయాళం సినిమా లో నివేద చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇందుకు గాను, ఆమెకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా లభించడం విశేషం.

nivetha 1

చైల్డ్ ఆర్టిస్ట్ గా నివేద థామస్ దాదాపు పది సినిమాలకు పైగానే నటించింది. టాలీవుడ్ లో నాని సరసన హీరోయిన్ గా “జెంటిల్ మెన్” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో ఆమె కు వరుస అవకాశాలు లభించాయి.

జై లవకుశ, నిన్నుకోరి సినిమాలు నివేద కెరీర్ లో సూపర్ హిట్ లు గా నిలిచాయి. అలాగే, నాని-సుధీర్ బాబు ల సినిమా “వి” లో కూడా నివేద కు మంచి పాత్రే దక్కింది. నివేద ఎంత క్యూట్ గా ఉంటుందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.. అయితే అంతకంటే క్యూట్ గా ఉన్న ఆమె చిన్నప్పటి ఫోటో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


End of Article

You may also like