Ads
కొలంబియాలోని ఒక ఆసుపత్రి వెయిటింగ్ రూమ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ఒక ఆవు వెయిటింగ్ రూమ్ లోకి వచ్చి రోగులపై దాడి చేసింది. ఇది ఆ ఆసుపత్రిలోని సిసి కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ ఆవు ఆసుపత్రి వెయిటింగ్ రూమ్ లోకి చొరబడడం తో సిబ్బంది, రోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం తలో వైపుకు పరిగెత్తడం సిసి కెమెరాలలో రికార్డు అయింది.
Video Advertisement
మొత్తం తొంభై సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆంటియోక్వియాలోని శాన్ రాఫెల్ ఆసుపత్రి లో నిరంతరం రద్దీ గా ఉండే వెయిటింగ్ రూమ్ లోకి ఈ ఆవు చొరబడింది. అకస్మాత్తుగా ఈ ఆవు ఆ గదిలోకి ప్రవేశించడం తో సందర్శకులు భయాందోళనలకు లోనయ్యారు. కొందరు తప్పించుకోగా.. ఈ ఆవు ఆసుపత్రిలో ఉన్న చైర్లపై పడింది. అయితే, ఈ ఘటన లో ఓ మహిళ గాయపడింది. మరొకతను ఆ ఆవును నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అయితే అదృష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.
End of Article