Ads
తాజాగా వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసిఆర్‌ఎ) రిపోర్ట్ ల ప్రకారం, రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి టెలికం కంపెనీలు మరోసారి సుంకాలను పెంచాలని యోచిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుండి టెలికాం కంపెనీలు రాబోయే నెలల్లో టారిఫ్ ప్లాన్ ల చార్జీలను పెంచే అవకాశం ఉంది. ఇక పై ఫోన్ మాట్లాడడం, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడం ఇప్పటిలా చీప్ గా ఉండకపోవచ్చు.
Video Advertisement
2021-22 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఈ పెంపుదల ప్రారంభమవుతుంది. అయితే, ఈ సుంకాలు ఎంత పెంచబడుతుందనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. 2 జి నుండి 4 జి వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల పెరుగుదల సగటు ఆదాయాన్ని (ఎఆర్‌పియు) మెరుగుపరుస్తుందని ఐసిఆర్‌ఎ నివేదిక పేర్కొంది. సంవత్సరం మధ్య నాటికి ఇది సుమారు 220 రూపాయలు ఉండవచ్చని ఓ సూచన చేసింది. ఈ పెరుగుదల వలన రాబోయే 2 సంవత్సరాలకు 11% నుండి 13% వరకు మరియు 2022 ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ మార్జిన్ 38% వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
కరోనావైరస్ మహమ్మారి వల్ల అనేక రంగాలు ప్రభావితమైనప్పటికీ టెలికాం పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేకాకుండా, డేటా వినియోగం మరియు లాక్డౌన్లో చార్జీల పెరుగుదల కారణంగా పరిస్థితి మెరుగుపడింది. ముఖ్యంగా, ఆన్‌లైన్ తరగతులు మరియు ఉద్యోగుల కోసం ఇంటి నుండి పని చేయడం వల్ల డేటా వినియోగం పెరిగింది.
End of Article