“ఫాస్టాగ్” తొందరగా రావాలంటే ఏం చేయాలి.? ఎంత వరకు రీఛార్జ్ చేయించుకోవచ్చు.?

“ఫాస్టాగ్” తొందరగా రావాలంటే ఏం చేయాలి.? ఎంత వరకు రీఛార్జ్ చేయించుకోవచ్చు.?

by Anudeep

Ads

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫాస్టాగ్ విషయం లో కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ఫోర్ వీలర్ వాహనాలు ఫాస్టాగ్ ను ఫాలో అవ్వాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసేసింది. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా టోల్ చెల్లించదలుచుకుంటే చెల్లించాల్సిన మొత్తం కంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆదేశించింది. అసలు.. ఈ ఫాస్టాగ్ అంటే ఏమిటి..?

Video Advertisement

fastag feature

మనం ఒక చోటు నుంచి మరొక చోటు కు వెళ్లే క్రమం లో రహదారులపై ప్రతి 70 కిలోమీటర్లకు మధ్యన టోల్ గేట్ లు ఉంటాయి. అక్కడ మనం టోల్ ఫీజు ను చెల్లిస్తూ ఉంటాం. అయితే, ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం ఫాస్టాగ్ ను తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక స్టికర్ లాంటిది. దానిని మీరు మీ కారుపై అంటించుకోవాలి. మీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలతో ఒక రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ను ఇస్తారు. ఇది బార్ కోడ్ రూపం లో ఆ స్టికర్ పై ఉంటుంది. ఒకసారి ఫాస్టాగ్ ను తీసుకుంటే.. ఇది ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది.

fastag

టోల్ ప్లాజాలు / ఇష్యూయర్ ఏజెన్సీల వద్ద వాహన దారులు ఈ ఫాస్టాగ్ ను తీసుకోవచ్చు. టోల్ ప్లాజా వద్ద పాయింట్ ఆఫ్ ది సేల్ వద్ద ఈ ఫాస్టాగ్ ను పొందవచ్చు. అయితే, ఇందుకోసం మీరు కొన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వ్యక్తిగత కెవైసి పత్రాలు, ఏదైనా గుర్తింపు పత్రం, అలాగే ఆధార్ కార్డును తప్పని సరిగా జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు, వాహన దారుని పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా తప్పనిసరి. అలాగే, అమెజాన్.ఇన్‌ లో ఫాస్టాగ్ ను తొందరగా పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ , కోటక్, పేటిఎమ్ పేమెంట్స్ వంటి బ్యాంకులను సంప్రదించడం ద్వారా కూడా ఫాస్టాగ్ ను పొందవచ్చు.

fastag 2

అలాగే, మీరు ఆన్ లైన్ నే ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్., నెఫ్ట్ ద్వారా ఆన్ లైన్ లోనే చెల్లింపులు చేసుకోవచ్చు. దాదాపు లక్ష రూపాయల వరకు మీరు ఒకేసారి రీ ఛార్జ్ చేసుకోవచ్చట. గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి యుపిఐ ఆప్ ల ద్వారా కూడా ఈ చెల్లింపులు చేసుకోవచ్చు.


End of Article

You may also like