Ads
ఈ బ్యాక్ ఎక్కడో చూసినట్లుందే.. ఎవరా అని ఆలోచిస్తున్నారా..? మన టాలీవుడ్ హీరోయిన్ దే అండి… ఈ మధ్య సినిమాలకు దూరం గా ఉంటూ.. తాజాగా సినిమాలు నిర్మించేస్తోంది. మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా.. గుర్తొచ్చేసిందా..? ఆ ఛార్మి కౌర్. ఛార్మి కౌర్ తాజాగా ఈ ఫోటో ను ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ ఫోటో వైరల్ అవుతోంది.
Video Advertisement
View this post on Instagram
గత కొంత కాలం గా ఛార్మి కౌర్ సినిమాలకు దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం నిర్మాణ రంగం లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి ఆమె వరుస సినిమాలు నిర్మిస్తోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఛార్మి కుర్రకారు ని ఎంత గా ఆకట్టుకుందో కొత్త గా చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్ గా కూడా కొనసాగింది. కానీ, అకస్మాత్తుగా సినిమాలు చేయడం తగ్గించింది.
ప్రస్తుతం నిర్మాణ భాగస్వామి గా కొనసాగుతోంది. 2002 లో నీ తోడు కావాలి చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మి ఐటెం సాంగ్ లు కూడా చేసిన సంగతి తెలిసిందే. “సక్కు బాయి” సాంగ్ ఎంత హిట్టో కొత్త గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతానికి సినిమాలకు దూరం గా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఛార్మి ఆక్టివ్ గానే ఉంటోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ , విజయ్ దేవరకొండ కాంబో లో వస్తున్న “లైగర్” సినిమా కి నిర్మాణ భాగస్వామి గా ఉంది. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ఛార్మి వరుసగా తన ఫోటోలను పంచుకుంటోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..
End of Article