Ads
మనలో చాలా మందికి ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో నటించిన వాళ్ళు గుర్తుండిపోతారు. వాళ్లు చెప్పిన డైలాగ్స్ కూడా గుర్తుండిపోతాయి. అవి ఒకవేళ ఐకానిక్ అయితే చాలా మంది వాటిని ఇమిటేట్ కూడా చేస్తారు. ఇందుకు ఉదాహరణ ఏ మాయ చేసావే సినిమాలో సమంత చెప్పిన డైలాగ్స్. ఈ సినిమా తరువాత ఇప్పటికి కూడా చాలా మంది సమంతని, కాదు కాదు సమంతకి డబ్బింగ్ ఇచ్చిన చిన్మయి గొంతుని ఇమిటేట్ చేస్తారు.
Video Advertisement
జెస్సీ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇది చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమాలోని బేబమ్మ పాత్ర కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. ఈ పాత్రలో నటించిన కృతి శెట్టి ఎక్స్ప్రెషన్స్, పర్ఫార్మెన్స్ తో పాటు తన డబ్బింగ్ కూడా ఆ పాత్ర అంత బాగా గుర్తుండిపోవడానికి ప్లస్ పాయింట్ అయ్యింది.
ప్రేక్షకులని ఇంత బాగా ఆకట్టుకున్న సంగీత అలియాస్ బేబమ్మ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ పేరు శ్వేత. శ్వేత విశాఖపట్నం కి చెందిన వారు. శ్వేత రేడియో మిర్చి లో ఆర్జే గా చేస్తారు. అంతే కాకుండా ఇంతకుముందు మా మ్యూజిక్ లో వచ్చే సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాంలో యాంకర్ శశితో పాటు శ్వేత కూడా వచ్చేవారు.
శ్వేత ఇటీవల ఈ టీవీలో ప్రసారం అయ్యే వావ్ ప్రోగ్రాంలో వచ్చారు. ఆ ప్రోగ్రాం లో తను డబ్బింగ్ కి ఎలా వచ్చారు అనే విషయం గురించి మాట్లాడారు. మళ్లీ రావా సినిమాకి వర్క్ చేస్తున్న మిర్చి కిరణ్ శ్వేతని డబ్బింగ్ ట్రై చేయమని అడగడంతో శ్వేత ట్రై చేశారట అది సినిమావాళ్ళకి నచ్చడంతో శ్వేత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. మళ్ళీరావా సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కి డబ్బింగ్ చెప్పారు శ్వేత.
ఆ తర్వాత హలో సినిమాలో, అలాగే రణరంగం సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కి డబ్బింగ్ చెప్పారు. భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానికి కూడా డబ్బింగ్ చెప్పారు శ్వేత. చిత్రలహరి సినిమాలో నివేత పేతురాజ్ కి వాయిస్ డబ్ చేశారు. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ లో ఇజబెల్లె లైట్ కి డబ్బింగ్ చెప్పారు. అంతే కాకుండా ఎంసీఏ సినిమాలో ఫ్యామిలీ పార్టీ పాటలో కూడా కనిపిస్తారు శ్వేత.
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా లో సీరత్ కపూర్ కి, ట్రాన్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో నజ్రియా నజీమ్ కి, ఒరేయ్ బుజ్జిగా సినిమాలో మాళవిక నాయర్ కి, ఇటీవల థియేటర్లలో విడుదలై విజయం సాధించిన జాంబీ రెడ్డి సినిమాలో దక్ష నాగర్కర్ కి, ఆహా లో విడుదలైన మలయాళం డబ్బింగ్ సినిమా మాయానది లో ఐశ్వర్య లక్ష్మి కి, ఇప్పుడు విడుదల అయిన చెక్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కి, అక్షర సినిమాలో నందిత శ్వేతకి డబ్బింగ్ చెప్పారు.
ఈ సినిమాల్లో మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎంతో మందికి తన వాయిస్ డబ్ చేశారు శ్వేత. కొంత కాలం క్రితం ఒక అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది శ్వేత. శ్వేత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ తో నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు శ్వేత.
watch video:
End of Article