Ads
మనకి ఊరికే ఏదైనా తినాలనిపిస్తే ఏమి చేస్తాం.. బయటకెళ్లడానికి కూడా బద్దకిస్తే ఏదైనా ఆర్డర్ చేసేసుకుంటాం. నిమిషాల్లో మన ముందుకొచ్చి డెలివరీ బాయ్ లు ఫుడ్ అందిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏమి కష్టాలుంటాయో.. అవి అన్ని అధిగమిస్తూ అవసరం కోసం వారు కష్టపడుతూ ఉంటారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ కంపెనీ చిన్న రైజ్ ఇచ్చినా.. లేదా ఎవరైనా కస్టమర్ టిప్ ఇచ్చినా ఆరోజు వారికి ఎంతో సంతృప్తి గా గడుస్తుంది.
Video Advertisement
డెలివరీ బాయ్స్ ని ఉత్తేజపరచడం కోసం చాలా మంది టిప్ లు ఇస్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం కంపెనీ వాళ్ళకి జీతం ఇస్తుంది కదా.. మళ్ళి ఈ టిప్ లు ఎందుకు అని భావిస్తూ ఉంటారు. చాలా మంది డెలివరీ బాయ్స్ కరోనా గడ్డు కాలం లో కూడా ఎంతో కష్ట పడి పని చేసారు. కొందరైతే రోజుకు 12 నుంచి 15 గంటలు కూడా పని చేసిన వారు ఉన్నారు. వారికి జీతాలు తక్కువే ఉంటాయి. కాబట్టి, వారికి టిప్ ఇవ్వడం వలన ఉత్తేజపరిచినట్లు ఉంటుంది. ఈ క్రమం లో ఓ ఘటన చోటు చేసుకుంది.
డెలివరీ బాయ్స్ అంటే ఎండకి, వర్షానికి లెక్క చేయకుండా తిరగాల్సి ఉంటుంది. ఇటీవల డామినోస్ కి చెందిన ఓ డెలివరీ బాయ్ వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా ఓ కస్టమర్ కి పిజ్జా డెలివరీ చేసాడు. అతడిని టిప్ కోరగా, సదరు కస్టమర్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీనితో ఆ డెలివరీ బాయ్ కి కోపం వచ్చి ఆ కస్టమర్ పైనా, సదరు మానేజ్మెంట్ పైనా పిచ్చి కోపం గా అరిచేసాడు. ఇదంతా సీసీ టీవీ లో రికార్డు అయింది.ఈ వీడియో టిక్ టాక్ లో అప్ లోడ్ అయింది.
కెమెరా వెనక నుంచి ఓ వ్యక్తి.. కామ్ డౌన్ ప్లీజ్.. ఇంకా చాల డెలివరీలు ఉన్నాయి అని చెప్పడం వినిపిస్తోంది. అయితే, సదరు డెలివరీ బాయ్ మాత్రం ఆగ్రహం లోనే నో… నేను ఇంకా ఇక్కడ పని చేయను.. వర్షం లో అంత సేపు నుంచున్నా కనీసం టిప్ ఇవ్వలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు. అంతే కాదు పక్కన ఉన్న పిజ్జా బాక్స్ లను కూడా నేలకేసి కొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో పెట్టడం తో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు సదరు డెలివరీ బాయ్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
watch video:
End of Article