సమంత రిజెక్ట్ చేసిన 8 సినిమాలు ఏవో తెలుసా..? అందులో ఎన్ని హిట్ అయ్యాయి అంటే.?

సమంత రిజెక్ట్ చేసిన 8 సినిమాలు ఏవో తెలుసా..? అందులో ఎన్ని హిట్ అయ్యాయి అంటే.?

by Mohana Priya

Ads

ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు సమంత. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. అయితే,  డేట్స్ కుదరకపోవడం వల్ల కానీ ఇంక వేరే కారణాల వల్ల కానీ సమంత కొన్ని సినిమాలు చేయలేకపోయారు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

movies rejected by samantha

 

#1 ఎవడు

ఎవడులో  శృతి హాసన్ పాత్ర కోసం ముందు సమంతని సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల సమంత ఆ సినిమా చేయలేకపోయారు.

movies rejected by samantha

#2 రుద్రమదేవి

రుద్రమదేవి సినిమాలో నిత్యామీనన్ పోషించిన పాత్రలో ముందు తనని అడిగారు అని, కానీ తర్వాత ఆ పాత్రలో నిత్యమీనన్ నటించారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సమంత.

movies rejected by samantha

#3 ఐ

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో సమంతని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు.

movies rejected by samantha

 

#4 కడల్

మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ముందు సమంతని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సమంత ఆ పాత్ర చేయలేకపోయారు.

movies rejected by samantha

#5 నిన్ను కోరి

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా నివేదా థామస్ స్థానంలో మొదట సమంతని అనుకున్నారట.

movies rejected by samantha

#6 పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సమంతని సంప్రదించారు అనే వార్తలు వినిపించాయి.

movies rejected by samantha

#7 ఎన్టీఆర్ కథానాయకుడు

ఈ సినిమాలో కూడా పాత హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే సమంత వద్దు అనుకున్నారు అనే వార్తలు వచ్చాయి.

movies rejected by samantha

#8 బ్రూస్ లీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో  వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట సమంతని సంప్రదించారట.

movies rejected by samantha

ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమాతో పాటు, తమిళ్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న  కాత్తువాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయ్యే ఫ్యామిలీ మాన్ సీక్వెల్ అయిన ఫ్యామిలీ మాన్ 2 లో కూడా నటించారు సమంత. ఇవి మాత్రమే కాకుండా ఆహాలో టెలికాస్ట్ అయిన సామ్ జామ్ షోకి హోస్ట్ గా వ్యవహరించారు.


End of Article

You may also like