Ads
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మనకు దూరమైనా కూడా, పాటల రూపంలో మనకి దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఆయన ఎంతో గొప్ప గాయకులు మాత్రమే కాకుండా మంచి హోస్ట్ కూడా. ఎన్నో ఈవెంట్స్ లో గెస్ట్ గా, అలాగే పాడుతా తీయగా ప్రోగ్రాం కి హోస్ట్ గా మనందరినీ పలకరించేవారు.
Video Advertisement
ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అందులోనూ ముఖ్యంగా సింగింగ్ ఈవెంట్ అయితే అక్కడ గాయకులు పాడే పాటలను ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పాడుతా తీయగా ప్రోగ్రాంలో అయితే కంటెస్టెంట్స్ ని ఎంతగానో ప్రోత్సహించేవారు. వారు ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాట్లను వివరంగా చెప్పడంతో పాటు, ఒక పాటని బాగా పాడినప్పుడు ఎంత బాగా పాడారో కూడా అంతే వివరంగా చెప్పేవారు.
ఒక ఎపిసోడ్ లో కంటెస్టెంట్ గణేష్, రజనీకాంత్ గారు హీరోగా నటించిన శివాజీ సినిమాలోని బల్లెలెక్కా పాటని పాడారు. ఈ పాటని ఒరిజినల్ గా బాలు గారు పాడారు అనే సంగతి మనందరికీ తెలుసు. ఈ పాటలో పల్లవి చాలా ఫాస్ట్ గా వస్తుంది. పదాలు కూడా సరిగా అర్థం అవ్వవు. అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఆ పార్ట్ అంతా ఊపిరి తీసుకోకుండా పాడాలి.
గణేష్ పల్లవి కరెక్ట్ గా, చాలా బాగా పాడటంతో బాలు గారు క్లాప్స్ కొట్టారు. అంతే కాకుండా గణేష్ పాడిన తర్వాత బాలు గారు కూడా ఆ పాట పాడారు. ఎవరైనా కంటెస్టెంట్స్ పాటలు పాడుతున్నప్పుడు బాలు గారి రియాక్షన్స్ చూస్తూ ఉంటే బాలు గారు ఎంత ఆసక్తిగా వింటారో, ఆయనకి సంగీతం అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. ఇప్పటికి కూడా ఎంతోమంది ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా పాడుతా తీయగా వంటి ప్రోగ్రామ్స్ ని బాలు గారు లేకుండా ఊహించుకోవడం అసలు అవ్వని పని ఏమో. చాలా మందికి బాలు గారి పాట వినకుండా రోజు గడవదు. కేవలం ఇప్పటి తరాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకి కూడా బాలు గారు ఒక ఆదర్శంగా నిలిచారు.
watch video :
End of Article