Ads
జనరల్ గా వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో వ్యక్తపరచగలదని అంటుంటారు. అందుకే ఫోటో లపై మనకి ఉన్న మోజు అంత తొందరగా పోదు. గత కొంత కాలం గా సెల్ఫీ లు కూడా మన జీవితం లో భాగం అయిపోయాయి. ఒకళ్ళు ఫోటో తీసే అవసరం లేకుండా.. మనకి నచ్చిన మధురమైన క్షణాలను గుర్తుంచుకునేలా మనకి మనమే ఒక చిన్న సెల్ఫీ తీసేసుకుంటున్నాం. అయితే, ఆ సెల్ఫీ ఓ జంటకి అదృష్టం తీసుకొచ్చింది. వారికి లండన్ టూర్ కి వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
Video Advertisement
బ్రిటీష్ ఎయిర్‌వేస్ వారు ఒక సెల్ఫీ కాంటెస్ట్ ను పెట్టారు. ఈ కాంటెస్ట్ కి ఆసక్తి ఉన్న వారు తమ పార్టనర్ తో కలిసి ఒక కపుల్ సెల్ఫీ పంపిస్తే.. అందులో ఎవరి సెల్ఫీ ఎంపిక అయితే వారికి లండన్ ట్రిప్ కు ఆహ్వానం పంపిస్తారనేది కాంటెస్ట్ సారాంశం. ఈ కాంటెస్ట్ కు చెన్నై కి చెందిన పింకీ మనోగరన్ మరియు హరీష్ రామన్ ల జంట కూడా తమ సెల్ఫీ ని పంపింది. అయితే, వీరికి అదృష్టం కలిసొచ్చింది.
వీరి సెల్ఫీ ఎంపికై లండన్ కి వెళ్లే అవకాశం లభించింది. ఈ జంట కు రెండు వరల్డ్ ట్రావెలర్ ప్లస్, ప్రీమియం ఎకానమీ రిటర్న్ టిక్కెట్లను చెన్నై నుండి లండన్‌కు వెళ్ళడానికి గిఫ్ట్ గా పంపారు. ఇక వీరిద్దరూ విజేతలుగా నిలవడం తో వీరి ఆనందానికి అంతు లేదు. వీరితో పాటు మరికొందరు కూడా విజేతలు గా నిలిచారు.
విజేతల్లో ఒకరైన పింకీ మనోగరన్ తనకు లండన్ అంటే ఎంతో ఇష్టమైన ప్రదేశమని పేర్కొన్నారు. ఆ నగరాన్ని చూడడం తన కల అని.. ఇలా తనకి అవకాశం వస్తుందని ఊహించలేదని పేర్కొంది. లండన్ ట్రిప్ లో ఎన్నో మధుర క్షణాలను సొంతం చేసుకుంటామని తెలిపింది. అదండీ సంగతి.. అదృష్టం ఎప్పుడు ఎలా తడుపు తడుతుందో తెలియదు. అలాంటి అదృష్టాలు మనక్కూడా వస్తే బాగుంటుంది కదా..
End of Article