Ads
కూతురుకి కొత్త బట్టలు కొని , తెల్లారి భార్య దగ్గరకెళ్ళి కుటుంబం తో కలిసి గుడికి వెల్దామనుకున్నాడు. కానీ అతని కోరిక తీరని కలే అయింది. భార్య దగ్గరకి వెళ్లేలోపే అతను ఈ లోకాన్ని వీడాల్సిన పరిస్థితి దాపురించింది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికులని కలచివేస్తోంది. మృతుడి బాగ్ లోని ఆధార్ కార్డు వివరాల ద్వారా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Video Advertisement
వివరాల్లోకెళితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం పుల్లూరు గ్రామ వాసి నరసింహులు (32) బీ టెక్ చదివి శ్రీసిటీలోని ఓ పైపుల కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారు. నరసింహులు నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. అతనికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. భార్య పిల్లలతో కలిసి నరసింహులు సూళ్లూరు పేట సాయి నగర్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితం భార్య, కూతురుని పుట్టింటికి పంపించాడు. ఉద్యోగం కారణం గా తాను సూళ్లూరు పేటలోని ఉండిపోయాడు.
అయితే, వారాంతం లో భార్య ను చూడడానికి రెండు రోజులు ఆఫీసులో సెలవు పెట్టి ఇంటికి వెళదామనుకున్నాడు. ముందు రోజు రాత్రి భార్యతో కూడా ఫోన్ లో మాట్లాడాడు. పాప కు కొత్త బట్టలు తీసుకున్నానని , పొద్దున్నే ముగ్గురం గుడికి వెళదామని చెప్పాడు.. తెల్లారేసరికి ఊరికి చేరుకుంటానని తెలిపాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతం లో హోలీక్రాస్ సెంటర్ వద్ద ఊరికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అదే సమయం లో అటు వైపు వేగం గా ఓ వాహనం దూసుకొచ్చి బస్సు స్టాప్ లో నిలుచుని ఉన్న నరసింహులు, అతనితో పాటు మరో వ్యక్తి వైపుకి దూసుకొచ్చింది. వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు ఈ ఘటన తో హతాశులయ్యారు. నరసింహులు బాగ్ లో చిన్న పాప వి కొత్త బట్టలు చూసి కలత చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
End of Article