Ads
ఇటీవల వయసు దాటిపోతే అబ్బాయిలకు పెళ్లి కావడం కొంచం కష్టం గానే ఉంది. ఈ క్రమం లో ఓ అబ్బాయికి కూడా 34 సంవత్సరాల వయసు వచ్చేసింది. అయితే ఎవరో ఒకమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం.. అతను చెయ్యని ప్రయత్నం లేదు. పెళ్లి కోసం ప్రయత్నించి విఫలం అవుతూ ఉండడం తో నిరాశ చెందుతూ ఉండేవాడు. అయితే, ఈ క్రమం లో అతని వదిన ఇచ్చిన సలహా మేరకు ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు.
Video Advertisement
representative image
వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజాన్పూర్ జిల్లా పోవయాన్ దగ్గరలోని గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి పెళ్లి కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే అతని వదిన అతనికి ఓ సలహా ఇచ్చింది. కట్నం ఇచ్చుకోలేని ఓ పేదింటి పిల్లను ఎలాంటి కట్నం అడక్కుండా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చింది. దీనితో, అతను మళ్ళీ సంబంధాలు వెతకగా..ఓ సంబంధం వచ్చింది.
representative image
ఫరుఖ్ బాద్ లో ఓ పేద కుటుంబానికి చెందిన యువతీ అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అయితే, వారిది అత్యంత పేద కుటుంబమని, పెళ్లి నిర్వహణ కు కూడా స్థోమత లేదని చెప్పడం తో సాదా గా వివాహం చేసుకుందామని ఆ అమ్మాయి కుటుంబానికి ముప్పై వేల రూపాయలను సదరు వ్యక్తి ఎదురు ఇచ్చాడు. అంతే కాదు పెళ్లి కూతురి కి నగలను కూడా బహుమానంగా ఇచ్చాడట.
representative image
ఫరుఖ్ బాద్ లోనే శనివారం ఓ గుడి లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇన్నాళ్లకు కల తీరింది అని అనుకునేలోపే సదరు యువతీ పరారయ్యింది. పెళ్లి అయినా ఐదు గంటలకే ఆ నూతన వధువు కనిపించలేదు. పెళ్లి కూతురు తో పాటు, ఆమె కూడా వచ్చిన నలుగురు బంధువులు కూడా కనిపించడం లేదు. పెళ్లి కోసం విలువైన నగలు కొని, కాబోయే భార్య కదా అని ఇచ్చానంటూ సదరు పెళ్లి కొడుకు వాపోతున్నాడు. ఆదివారం వరుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే డబ్బు కోసమే ఈ నాటకం అంతా ఆడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
End of Article