Ads
చాలా సినిమాల్లో కొన్ని సీన్లు రిపీటెడ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఒక సీన్ ను పోలినట్లు మరో సీన్ ను తీయడం వలన ఇలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇవి కాపీ సీన్లు కావచ్చు, లేదా ఒక సీన్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి తీసేవి కావచ్చు. ఏదైనా ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం అనేది ముఖ్యం.
Video Advertisement
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అదేంటో మీరు చూసేయండి. అత్తారింటికి దారేది లో సమంత, ప్రణీతలు పార్టీ కు వెళ్లే టైం లో షార్ట్ స్కర్ట్స్ వేసుకున్నందుకు నదియా తిట్టి, డ్రెస్ చేంజ్ చేయిస్తుంది కదా..
ఆ తరువాత వారు కార్ లో వెళుతూ పవన్ కళ్యాణ్ ను మాటల్లో పెట్టేసి.. సైలెంట్ గా డ్రెస్ మార్చేసుకుంటారు. ఈ సినిమాలో ఈ సీన్ బాగా క్లిక్ అయింది. కానీ, ఈ సీన్ ఇంతకుముందే ఓ పాత సినిమా లో ఉంది. శరత్ దర్శకత్వం లో వచ్చిన “పెద్దింటల్లుడు” సినిమా లో ఉంది. ఈ సినిమా లో సుమన్ హీరో గా నటించారు.
ఈ సినిమా లో నగ్మా హీరోయిన్ గా నటించారు. నగ్మా తో పాటు, ఆమె చెల్లెలు కార్ లో ఉండగానే చీరను మార్చేసి మోడరన్ లుక్ లోకి మారిపోతారు. ఈ సీన్ ను మీరు ఈ కింద వీడియో లో చూడండి. ఇది యాదృచ్ఛికం గా జరిగి ఉండవచ్చు.. లేదా ఈ సీన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి తీసి ఉండవచ్చు. కొన్ని సార్లు ఇంతే ఇలా జరిగిపోతూ ఉంటుంది.
End of Article