Ads
టాలీవుడ్ నటుడు నాగయ్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నాగయ్య చాలా మందికి సుపరిచితులు. ఈయన వేదం మూవీ లో శ్రీను అనే ఓ బాబు కు తాత లాగ నటించి.. ఆ సినిమా చూసిన వారందరిచేతా కన్నీరు పెట్టించారు. ఆ సినిమా లో బన్నీ తో కూడా ఆయన తాత అని పిలిపించుకుంటారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఆయన పేరు “వేదం” నాగయ్య గా మారిపోయింది.
Video Advertisement
ఆ సినిమా తరువాత కూడా నాగయ్య పలు సినిమాల్లో నటించారు. వయసు మీద పడ్డా, ఆయన తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. దాదాపు 30 సినిమాలలో నాగయ్య నటించారు. రామయ్య వస్తావయ్యా, లీడర్, స్పైడర్, నాగవల్లి వంటి సినిమాలు నాగయ్య కి మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన ఆర్ధిక సమస్యల కారణం గా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. అయినప్పటికీ, ఆర్ధిక ఇక్కట్లు తీరలేదు. ఇటీవలే ఆయన భార్య కూడా మృతి చెందారు. తెలంగాణ సీఎం కెసిఆర్ ఆయనకు ఆర్ధిక సాయం అందించారు.అలాగే, “మా” అసోసియేషన్ కూడా ఆయనకు నెల నెలా పింఛన్ వచ్చే ఏర్పాటు చేసింది. నేడు ఆయన మృతి చెందడం తో.. సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. నాగయ్య గుంటూరు జిల్లా, నర్సరావు పేట కు దగ్గరిలో ఉండే దేసవరం పేట గ్రామం. అయితే అక్కడ పని దొరక్కపోవడంతోనే కొడుకు తో కలిసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు.
End of Article