Ads
ఓ బాలికను అత్యాచారం చేయడమే అమానుషం. ఆమె పదహారేళ్ళ వయసులో ఉంది. ఆమెను రేప్ చేయడం తో.. ఆ ఊరి ప్రజలు ఆమె పట్ల అమానుషం గా ప్రవర్తించారు. ఆమెతో పాటు నేరస్తుడిని కూడా కట్టివేసి.. వారిద్దరిని ఊర్లో ఊరేగింపు లాగ తిప్పారు.. “భారత్ మాతా కి జై” అంటూ నినాదాలు కూడా చేసారు. భారత దేశం లో ఆడపిల్లలకు రక్షణ గా నిలవాల్సింది పోయి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్రం గా స్పందిస్తున్నారు.
Video Advertisement
నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతూ వస్తోంది. పదహారేళ్ళ బాలికను, ఆమెను రేప్ చేసిన వ్యక్తిని తాళ్లతో కట్టివేసి వారితో పెరేడ్ లాగ నడుచుకుంటూ ఊరంతా తిప్పారు. వారిని తిప్పుతూ భారత్ మాతా కి జయ్ అంటూ స్లొగన్స్ ను చదువుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులను నమోదు చేసారు. ఈ మేరకు పోలీస్ ఆఫీసర్ దిలీప్ సింగ్ బిల్వాల్ పేర్కొన్నారు. ఆ బాలికను, రేప్ చేసిన వ్యక్తిని ఆ ఊరి వారు వెలేసినట్లు ప్రవర్తించారు. ఈ సంఘటన ఆదివారం గిరిజన ఆధిపత్య ప్రాంతమైన అలిరాజ్ పూర్ ప్రాంతం లో చోటు చేసుకుంది.
నివేదికల ప్రకారం, అత్యాచారం చేయబడ్డ ఆ బాలిక కుటుంబ సభ్యులు కూడా ఈ ఘాతుకానికి ఒడిగట్టడం లో పాలు పంచుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీస్ ఆఫీసర్ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. గ్రామంలో పరేడ్ చేసి ఆమెను కొట్టినందుకు బాలిక కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.
End of Article