పవన్ కళ్యాణ్ చేసిన ఈ 9 సినిమాలు రీమేక్ లే అని మీకు తెలుసా? అందులో ఎన్ని హిట్ అయ్యాయో చూడండి..!

పవన్ కళ్యాణ్ చేసిన ఈ 9 సినిమాలు రీమేక్ లే అని మీకు తెలుసా? అందులో ఎన్ని హిట్ అయ్యాయో చూడండి..!

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అన్న విషయం అందరికి తెలుసు. వరుస ఫ్లాపులు వెంటాడినా.. పవన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదే లేదు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం తో దాదాపు మూడేళ్లకు పైగా సినిమాలకు దూరం గా ఉన్నారు.

Video Advertisement

vakeel saab trailer

అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కానీ, ఆయన ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు అని చెప్పడానికి వకీల్ సాబ్ ఓపెనింగ్ కలేక్షేన్సే ఉదాహరణ. కరోనా టైం లో కూడా వకీల్ సాబ్ కు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి.

 

13 Pawan Kalyan – Shruti Haasan

ఇంకో విషయం ఏమిటంటే.. పవన్ రీమేక్ చేస్తే.. ఆ సినిమా రీమేక్ లా ఉండదు అన్న టాక్ కూడా ఉండనే ఉంది. వీటిల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. కొన్ని ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. ఇంతకు పవన్ ఏ సినిమాలను రీమేక్ చేసారో.. వాటిల్లో ఏవి హిట్ అయ్యాయో.. ఏవి ఫ్లాప్ అయ్యాయో ఓ లుక్ వేద్దాం.

#1 వకీల్ సాబ్:

1 vakil sabఇది అందరికీ తెలిసిన విషయమే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ “పింక్” నుంచి రీమేక్ చేసారు. ఇదే సినిమా ను తమిళ్ లో అజిత్ రీమేక్ చేయగా.. అక్కడ మాస్ హిట్ అయింది. ప్రస్తుతం వకీల్ సాబ్ థియేటర్లలో బాగానే ఆడుతోంది. మరి ఫలితం తేలాల్సి ఉంది.

#2 కాటమరాయుడు:

2 katamarayuduపవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్ వీరం కి రీమేక్. తమిళ్ వీరం లో అజిత్ హీరో గా చేసారు.

#3 గోపాల గోపాల:

3 gopala gopalaపవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సినిమా గోపాల గోపాల. ఇది హిందీ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.

#4 గబ్బర్ సింగ్:

4 gabbar singhసల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన హిందీ సినిమా దబాంగ్. దీనికి తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్. దబాంగ్ కు, గబ్బర్ సింగ్ కు చాలా తేడాలు కనిపిస్తాయి. గబ్బర్ సింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

#5 తీన్ మార్:

5 teen marహిందీ సినిమా లవ్ ఆజ్ కల్ ను తెలుగు లో తీన్ మార్ గా రీమేక్ చేసారు. పవన్, త్రిష ఈ సినిమాలో నటించారు. ఇది ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

#6 అన్నవరం:

6 annavaramతమిళ సినిమా తిరుపచ్చి ని తెలుగు లో అన్నవరం గా రీమేక్ చేసారు. తమిళ తిరుపచ్చి లో హీరో విజయ్ నటించారు. ఈ సినిమా తెలుగు లో మాత్రం ఫ్లాప్ అయింది.

#7 ఖుషి:

7 khushiఖుషి పవన్ కెరీర్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి రికార్డ్స్ అన్నిటిని ఖుషి సినిమా తిరగరాసింది. ఇది తమిళ్ ఖుషి సినిమా నుంచి రీమేక్ చేసారు.

#8 సుస్వాగతం:

8 suswagathamసుస్వాగతం సినిమా కూడా తెలుగు లో హిట్ అయింది. తమిళ సినిమా లవ్ టుడే నుంచి ఈ సినిమా ను రీమేక్ చేసారు.

#9 గోకులం లో సీత:

9 gokulam lo seethaపవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా డీసెంట్ హిట్ అయింది. ఆ తరువాతే గోకులం లో సీత సినిమా వచ్చింది. ఇది కూడా హిట్ అయ్యి పవన్ ను ఫామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. ఈ సినిమా ను తమిళ నట గోకులత్తిల్ సీతాయ్ నుంచి రీమేక్ చేసారు.


End of Article

You may also like