Ads
ఇటీవల ఆత్మహత్యలు ఎక్కువ గా జరుగుతున్నాయి. కొందరైతే.. తమ ప్రాణాలు తీసుకుంటూ.. తమ పిల్లలు అనాధలుగా మిగలకూడదని వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కృష్ణ జిల్లా పరిధి లో నున్న లో చోటు చేసుకుంది.
Video Advertisement
న్యూస్ 18 కధనం ప్రకారం, కృష్ణ జిల్లా నున్న కు చెందిన సురేంద్ర కు, గుంటూరు జిల్లా తాడేపల్లి కి చెందిన వాణిని ఇచ్చి వివాహం చేసారు. వీరికి పెళ్ళై నాలుగేళ్లు అవుతోంది. వీరికి ఒక మూడేళ్ళ పాప (భావన), పదినెలల పాప (అక్ష) ఉన్నారు. ఇటీవల భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చాయి. కొంత కాలం చిల్లర కొట్టు వ్యాపారం నడిపిన సురేంద్ర సజావు గా లేకపోవడం తో ఆటో తోలడం ప్రారంభించాడు.
అయితే, ఆర్ధిక ఇబ్బందుల వలనే ఇద్దరిమధ్య గొడవలు జరుగుతుండేవి. కట్నం గా ఇస్తామన్న అర ఎకరం పొలం ఇవ్వకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని సురేంద్ర మాటలతో వేధించడం తో వాణి మనస్తాపానికి గురి అయింది. ఈ క్రమం లోనే వాణి ఆత్మహత్య కు ప్రయత్నించింది. భర్త సురేంద్ర ఆటో నడుపుకోడానికి వెళ్లిన సమయం లో ఇద్దరు పిల్లలకు విషం కలిపిన పాలు ఇచ్చింది. తానూ ఆ పాలను తీసుకుంది.
ఆదివారం ఉదయమే సురేంద్ర ఆటో కిరాయి కి వెళ్ళాడు. మధ్యాహ్నం కూడా అందరు కలిసే భోజనాలు చేసారు. ఆరోజు సాయంత్రం సమయం లో సురేంద్ర తిరిగి ఆటో కిరాయికి వెళ్లే సమయం లో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. సురేంద్ర బయటకు వెళ్లిన తరువాత వాణి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉన్నట్లుండి పిల్లలిద్దరూ, వాణి వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోవడం తో స్థానికులు సురేంద్రకు సమాచారమిచ్చారు.
వెంటనే సురేంద్ర కూడా ఇంటికి వచ్చాడు. సురేంద్ర వచ్చేసరికి వాణి అస్వస్థత కు లోనైంది. పిల్లలిద్దరూ ఇబ్బంది పడుతూ కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దారిలోనే ఓ పాప చనిపోయింది. ఆసుపత్రికి చేరుకున్నాక మరో పాప కూడా మరణించింది. పదినెలల పాప అయిన అక్ష ఆసుపత్రిలో నోటినుంచి.. ముక్కునుంచి రక్తం కారుతుంటే కొన్ని గంటలపాటు నరకం అనుభవించి మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం సమయానికి వాణి కూడా మరణించింది. వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ పసిపాప కు చికిత్స చేస్తుండగా..ఎక్కిళ్ళు పెడుతూ అందరివైపు చూస్తూ ఉంటె.. అక్కడి వారి గుండె పగిలింది.
End of Article