ఒకేరోజు, ఒకే టైం లో 16 మందిని డేటింగ్ కి పిలిచిన అమ్మాయి.. ఆ తరువాత ఏమి జరిగిందంటే..?

ఒకేరోజు, ఒకే టైం లో 16 మందిని డేటింగ్ కి పిలిచిన అమ్మాయి.. ఆ తరువాత ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఒకప్పుడు అబ్బాయిలు తాము చదువుతున్న స్కూల్ లో లేదా కాలేజీ లో చదువుకునే అమ్మాయిలను ఇష్టపడేవారు. ఒకరినొకరు తెలుసుకోవడానికి రహస్యం గా కలుసుకునేవారు. ఇప్పుడు దానికి డేటింగ్ అని పేరు పెట్టారు.. ఇప్పుడు అమ్మాయిలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రకరకాల డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.. వాటిలో మనకి నచ్చిన వారితో మాట్లాడి.. డైరెక్ట్ గా కలవొచ్చు..

Video Advertisement

date 1

రిలేషన్ షిప్స్ కావాలనుకునే వారు ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు. ఒంటరిగా ఉండలేకపోవడం.. తమ మనసులోని విషయాలను ఎవరితోనూ పంచుకునే అవకాశం లేకపోవడం తో.. చాలా మంది ఇలాంటి ఆప్స్ పై ఆధారపడుతుంటారు. అయితే.. ఎవరైనా డేటింగ్ కి వెళ్లాలనుకుంటే తమకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుకుని ఒకరోజు ప్లాన్ చేసుకుంటారు. కానీ.. ఓ అమ్మాయి ఏకం గా పదహారు మందిని డేటింగ్ కి పిలిచింది. అది కూడా ఒకేరోజు.. ఆ తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం..

date 2

ఆమెతో డేటింగ్ కి వచ్చిన వారిలో ఒక వ్యక్తి వీడియో రికార్డు చేసాడు. అతనికి ఇదే మొట్టమొదటి డేట్ అట. కానీ.. అక్కడ తనలాగే మరో నలుగురు కనిపించేసరికి అతను ఆశ్చర్యపోయాడట. మెల్లగా కౌంట్ పెరుగుతూ మొత్తం పదహారు మంది అబ్బాయిలు అక్కడకి చేరుకున్నారట. కానీ ఇది చూసి తనకి చాలా షాకింగ్ గా ఉందని ఆ అబ్బాయి చెప్పాడు. అక్కడకి డేటింగ్ కి వచ్చిన అబ్బాయిలందరు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వారందరితో.. ఆ అమ్మాయి ఏమని చెప్పింది అంటే.. తనతో మ్యాచ్ ఐన వారందరిని ఒకేరోజు డేట్ కి రమ్మని చెప్పానని.. మీరు కూడా ఒకరినొకరు కలుపుకుపోవాలని చెప్పుకొచ్చింది.

date 3

ఇది చాలా స్ట్రేంజ్ డేట్ కదా.. ఇలాంటి ఇన్సిడెంట్ గతం లో ఓసారి జరిగింది. ఒకమ్మాయి తన ఫస్ట్ డేట్ కి మొత్తం 23 మంది బంధువుల్ని కూడా తీసుకొచ్చింది. దీనితో.. సదరు యంగ్ బాయ్ బిల్ కూడా కట్టకుండా అక్కడనుంచి జారుకున్నాడు. ఇవి చెప్పుకోవడానికి ఫన్నీ గా ఉన్నా.. రియల్ లైఫ్ లో ఎదురైతే ఇబ్బందికరం గానే ఉంటుంది కదా.. మీరెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ను ఫేస్ చేసారా..? ఒకవేళ ఫేస్ చేసి ఉంటె.. కామెంట్స్ లో పంచుకోండి.

https://youtu.be/lkO3z2uF3q4


End of Article

You may also like