Ads
భార్యాభర్తల బంధం ఎంతో సున్నితమైనది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం ఒక్కటే ప్రధానం కాదు.. ఇరువురికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అర్ధం చేసుకుని మసలుకున్న వారు అదృష్టవంతులే. కానీ, దురదృష్టవశాత్తు మన దేశం లో గృహ హింస కేసులు ఎక్కువ అవుతున్నాయి.
Video Advertisement
భర్తని అనే అహంకారం తో.. భార్యను ఏమి చేసినా భరించాలని భావించే వారు హెచ్చు సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమం లో గృహ హింస కి గురి అవుతూ అనేక కష్టాలు పడుతున్న ఆడువారు ఎంతమందో ఉన్నారు. కొందరు పైకి చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, ఓ గృహిణి భర్త పెట్టె హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంది..
“నా భర్తను చంపేయండి.. అతను కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా..” అంటూ ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికం గా సంచలనం రేపింది. డైలీ హంట్ – ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం యూసఫ్ గూడ, ఎస్ ఆర్ హిల్స్ కు సమీపం లో ఆంజనేయులు, విజయ దంపతులు నివసిస్తున్నారు. భర్త ఆంజనేయులు రోజు తన భార్యని చిత్ర హింసలకు గురి చేసేవాడు.. వీరిద్దరూ 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అకారణం గా మొదలైన మనస్పర్థలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి.
దీనితో ఆంజనేయులు విజయను చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెట్టాడు.. దానికి తోడు ఆంజనేయులు సోదరుడు చంద్రయ్య కూడా ఆమెను చంపివేయాలంటూ ప్రోత్సహించేవాడట. ఈ మేరకు ఆమె లేఖలో పేర్కొంది. తనను వదిలించేసుకుంటే.. ఆంజనేయులుకి మరో పెళ్లి చేయాలనీ పధకం పన్నేవాడట. తన పిల్లల పోషణను తన తల్లి, సోదరులు తీసుకోవాలని ఆమె కోరింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article