ప్రస్తుతం భారత దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురుకుంటుంది… కరోనా మహమ్మారి ఉప్పెన లాయావత్ భారత దేశాన్ని కబళించింది.గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది అంటే సెకండ్ వేవ్ అత్యంత దారుణంగా విరుచుకుపడుతుంది.రోజు దాదాపుగా 2 నుంచి 3 లక్షల పోస్టివ్ కేసులను ఎదురుకుంటుంది భారత దేశం.

ambulance
.ఇందుకు గాను ఒక్కసారి ఎక్కడలేని ఆక్సిజన్, అంబులెన్సులు,మందుల కొరత ఏర్పడింది.వైద్య సిబ్బంది కూడా రాత్రి పగలు అంటూ తేడా లేకుండా కృషి చేస్తున్నారు.ఇదే అదునుగా చూసుకున్న కొందరు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు.కష్టాల్లో ఉన్న ప్రజలకి సహాయ పడాల్సిన వారే దోచుకుంటున్నారు.ఢిల్లీలోని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా పది వేల రూపాయలు డిమాండ్ చేసాడు అది కూడా కేవలం 4 కిలోమీటర్ల ప్రయాణం కోసం మాత్రమే.దీని కి సంబంధించి ఒక రెసిప్ట్ ని షేర్ చేసారు ఐ పీ యస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా. ప్రపంచం మన నైతిక విలువలని గమనిస్తుంది అంటూ పోస్ట్ పెట్టారు.
Ten thousand rupees for a distance of four kms. Ambulance rental in Delhi.
The world is watching us today. Not only the devastation but also our moral values. pic.twitter.com/dZoJpSbF6c
— Arun Bothra 🇮🇳 (@arunbothra) April 28, 2021
