Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఒక మనిషికి విలువలు అనేవి ఎంత ముఖ్యమో చెప్పే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, అదా శర్మ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పవిత్ర లోకేష్, సింధు తులానీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Video Advertisement
ఇంకా మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే టు వేరియేషన్స్ ఉన్న దేవరాజు పాత్రలో ఉపేంద్ర నటించారు. ప్రకాష్ రాజ్ కనిపించేది కొద్ది సేపే అయినా కూడా, ఆయన పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
హీరో వెడ్డింగ్ ప్లానర్ గా ఆదా శర్మ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆదా శర్మ తండ్రి రావు రమేష్ గారి అన్న పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణ గారు అదా శర్మ పెళ్లి కట్నం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు హీరో ఆ డబ్బుల్ని తీసుకోవడానికి వెళ్తాడు. ఎమ్మెస్ నారాయణ గారి కొడుకు పాత్ర పోషించిన అమిత్ తివారి డబ్బులు తీసుకొని పరిగెడుతున్నప్పుడు అతనిని పట్టుకోవడానికి వెళ్తూ హీరో కార్ మీద నుండి పల్టీ కొట్టి కిందకి దిగి మళ్ళీ పరిగెడతాడు.
అయితే ఆ సీన్ ని 0.25 స్పీడ్ లో చూడండి. అలా కార్ మీద నుంచి కిందకు దూకేది
అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్ డూప్ అని మనకు అర్థం అవుతుంది. ఏదేమైనా సినిమా అన్న తర్వాత డూప్ ఉపయోగించడం సహజం. కానీ ఇలా మధ్యలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అంతే.
watch video:
https://youtu.be/ny-vZjMnGm0?t=3471
End of Article