“కరోనాను లైట్ తీసుకోకండి”…చనిపోయేముందు గర్భవతిగా ఉన్న డాక్టర్ చివరి మాటలు ఇవి.! (వీడియో)

“కరోనాను లైట్ తీసుకోకండి”…చనిపోయేముందు గర్భవతిగా ఉన్న డాక్టర్ చివరి మాటలు ఇవి.! (వీడియో)

by Mohana Priya

Ads

డింపుల్ అరోరా చావ్లా అనే ఒక డెంటిస్ట్ ఏడు నెలల గర్భవతి గా ఉన్నారు. తర్వాత ఏప్రిల్ లో డింపుల్ కి  కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత డింపుల్ తన బిడ్డని కోల్పోయారు. ఆ తర్వాత రోజు డింపుల్ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. డింపుల్ కి ఇంతకు ముందు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. డింపుల్ చనిపోయే ముందు ఏప్రిల్ 17వ తేదీన కోవిడ్ ని తేలికగా తీసుకోవద్దు అంటూ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ఒక వీడియో మెసేజ్ పెట్టారు.

Video Advertisement

Pregnant doctor video message about coronavirus

 

ఆ వీడియోలో డింపుల్ మాట్లాడుతూ, “నేను చాలా కష్టంగా ఈ వీడియో చేస్తున్నాను. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈ కరోనాని తేలికగా తీసుకోవద్దు అని చెప్పాలనుకుంటున్నాను. చాలా బ్యాడ్ సింప్టమ్స్ ఉన్నాయి. నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ నా మెసేజ్ ని అందరికీ చేర్చాలని అనుకుంటున్నాను.బయటికి వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దయచేసి మాస్క్ వేసుకోండి.

బయట అలాగే ఇంట్లో కూడా మీ సొంత వాళ్ళ కోసం మాస్క్ వేసుకోండి. నేను ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని ప్రార్థిస్తాను. అందులో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి సింప్టమ్స్ ఎవరికీ రాకూడదు అని నేను అనుకుంటున్నాను. కరోనాని తేలికగా తీసుకోవద్దు అని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి.

Pregnant doctor video message about coronavirus

దయచేసి ఇర్రెస్పాన్సిబుల్  గా ఉండకండి. మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఎవరినైనా కలవాల్సి ఉన్నా, ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉన్నా మాస్క్ తీయకండి. ఎందుకంటే మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళు ఉండొచ్చు. వారందరిపై చాలా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో నేను చాలా ప్రయత్నించాను.నేను ఎప్పుడూ ఇలా కూర్చునే వ్యక్తిని కాదు. నాకు ఎప్పుడూ పని చేయాలి అని ఉండేది. నాకు పరిగెత్తాలి అని, నడవాలి అని ఉండేది. చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని” అని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో డింపుల్ భర్త రవీష్ చావ్లా మాట్లాడుతూ డింపుల్ చాలా జాగ్రత్తగా ఉండేవారు అని, మూడు నాలుగు నెలలకి ఫుల్ బాడీ చెకప్ చేయించుకునేవారు అని, బయటికి వెళ్లినప్పుడు 2 మాస్కులు ఒక్కొక్కసారి అయితే 3 మాస్కులు ధరించే వారు అని,

Pregnant doctor video message about coronavirus

ఒక్కొక్కసారి తాను వద్దని చెప్పినా కూడా డింపుల్ ఎక్కువ జనాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పీపీఈ కిట్ వేసుకునే వారు అని చెప్పారు.  తను అంత బాధ పడుతున్నా కూడా ఎంతో ధైర్యంగా వేరే వారికి ఈ విషయంపై అవగాహన కల్పించారు అని, తన కొడుకు పెద్దయ్యాక తన తల్లిని చూసి “నా తల్లి హీరో” అనుకోవాలి అని, తన తల్లి నుండి ఇన్స్పైర్ అవ్వాలి అని అన్నారు.

watch video :


End of Article

You may also like