Ads
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మనకు దూరమైనా కూడా, పాటల రూపంలో మనకి దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఆయన ఎంతో గొప్ప గాయకులు మాత్రమే కాకుండా మంచి హోస్ట్ కూడా. ఎన్నో ఈవెంట్స్ లో గెస్ట్ గా, అలాగే పాడుతా తీయగా ప్రోగ్రాం కి హోస్ట్ గా మనందరినీ పలకరించేవారు.
Video Advertisement
ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అందులోనూ ముఖ్యంగా సింగింగ్ ఈవెంట్ అయితే అక్కడ గాయకులు పాడే పాటలను ఎంజాయ్ చేసేవారు. అయితే ఈ టీవీలో టెలికాస్ట్ అయ్యే స్వరాభిషేకం ప్రోగ్రాంలో బాలు గారు ఎన్నో సార్లు పర్ఫార్మ్ చేశారు అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఒక ఎపిసోడ్ లో ఎస్పీ చరణ్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చారు. ఇందులో చరణ్ మన్మధుడు సినిమాలోని నేను నేనుగా లేనే పాటని పాడారు.
అయితే పాట పాడే ముందు చరణ్ మాట్లాడుతూ ఒక పెద్ద తమిళ్ అవార్డ్ ఫంక్షన్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అవార్డు ఇస్తూ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చరణ్ పాడిన పాట ప్లే చేశారు అని చెప్పారు. బాలు గారు కూడా ఈ పాట ఆయన పాడింది కాదు కదా అని అనుకున్నారట. తర్వాత చరణ్ ఈ పాట తనే పాడాను అని ప్రెస్ మీట్ లో చెప్పారట. అయితే చరణ్ మాట్లాడుతున్నప్పుడు బాలు గారు కూడా స్టేజ్ మీదకి వచ్చారు.
అప్పుడు చరణ్ పాడుతూ ఉంటే, బాలు గారు కూడా చరణ్ పాడిన లైన్ ని మళ్ళీ రిపీట్ చేశారు. ఇలా సరదాగా జరిగిన ఆ సందర్భాన్ని అప్పుడు టీవీలో చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బాలు గారు లేరు అనే విషయం గుర్తొచ్చి బాధగా అనిపిస్తుంది.ఇప్పటికి కూడా ఎంతోమంది ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మందికి బాలు గారి పాట వినకుండా రోజు గడవదు. కేవలం ఇప్పటి తరాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకి కూడా బాలు గారు ఒక ఆదర్శంగా నిలిచారు.
watch video :
End of Article