ఈ హీరోయిన్ సోదరి కూడా సీరియల్ హీరోయిన్ అని మీకు తెలుసా.?

ఈ హీరోయిన్ సోదరి కూడా సీరియల్ హీరోయిన్ అని మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

2017 లో విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటి మళ్ళీ రావా. ఈ సినిమాతో గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించారు. 2017 లో లవ్ స్టోరీస్ తక్కువగా రావడంతో, అది కూడా ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులు అవ్వడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతో బాగా ఆదరించారు.

Video Advertisement

Malli raava actress Preethi Asrani unknown details

ఈ సినిమా స్టోరీ, డైలాగ్స్, పాటలు, నటీనటుల పెర్ఫార్మెన్స్, అన్ని మళ్ళీరావా సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి. మళ్ళీరావా సినిమాతో అందరికీ ఇంకా సుపరిచితులు అయ్యారు ప్రీతి ఆస్రాని. ప్రీతి ఆస్రాని ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ చిన్నప్పటి పాత్రలో నటించారు.

Malli raava actress Preethi Asrani unknown details

ప్రీతి ఆస్రాని అంతకుముందు పక్కింటి అమ్మాయి అనే సీరియల్ లో నటించారు. అలాగే ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో కూడా లీడ్ రోల్ లో నటించారు ప్రీతి ఆస్రాని.  ఆ తర్వాత సన్ టీవీలో టెలికాస్ట్ అయిన మిన్నలే అనే సీరియల్ లో కూడా నటించారు. ప్రీతి ఆస్రాని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అంజు ఆస్రాని కి సోదరి అవుతారు.

Malli raava actress Preethi Asrani unknown details

అంజు ఆస్రాని కూడా అగ్ని పూలు, నాలుగు స్థంభాలాట తో పాటు సీరియల్స్ లో నటించారు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించారు. “గోపాల గోపాల” చిత్రంలో వెంకటేష్ కి అక్కగా నటించారు. వీరిద్దరూ కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రీతి ఆస్రాని కి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ఉంది అని తెలిపారు. అందుకోసం ప్రీతి ఆస్రాని నటిస్తూనే చదువుకుంటున్నారు అని అంజు ఆస్రాని తెలిపారు. ప్రస్తుతం ప్రీతి ఆస్రాని గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సీటీ మార్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల గోపీచంద్ , తమన్నాల కాంబినేషన్లో వచ్చిన “సీటిమార్” చిత్రంలో కూడా “ప్రీతీ” నటించారు.


End of Article

You may also like