Ads
ఒక వ్యక్తి గొప్ప స్థాయికి ఎదగాలంటే హార్డ్ వర్క్ తో పాటు ఆలోచనా విధానం కూడా విభిన్నంగా ఉండాలి. అప్పుడే వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. బిల్ గేట్స్. పరిచయం అక్కర్లేని వ్యక్తి. బిల్ గేట్స్ ఎంత కష్టపడి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. బిల్ గేట్స్ ని చూసి స్ఫూర్తి చెందిన వాళ్లు ఎన్నో లక్షల మంది ఉంటారు.
Video Advertisement
ఎంతో మంది ఆయనను ఒక రోల్ మోడల్ గా భావిస్తారు. అయితే ఒక సందర్భంలో బిల్ గేట్స్ ని “మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీరు ఏం చేస్తారు?” అని అడిగారు. అందుకు బిల్ గేట్స్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బిల్ గేట్స్ మాట్లాడుతూ “నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ముందు ఒక కోడి పెట్టని కొంటాను.
తర్వాత ఆ కోడి పెట్ట కొన్ని కోళ్లకు జన్మనిస్తుంది. కొంత కాలానికి అవి కూడా పెరిగి పెద్దవయ్యి పిల్లలని పెట్టడం మొదలుపెడతాయి”. అవి పెట్టే గుడ్లను అమ్మితే వచ్చిన డబ్బులతో లేయర్ కోళ్ల ను కొంటాను.అప్పుడు అవి పెట్టే గుడ్లను కూడా అమ్మడంతో రోజు డబ్బులు వస్తాయి.
అంతే కాకుండా నా దగ్గర ఉన్న కోళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ లోగా 100 కోళ్లని ఏడాదిపాటు పెంచితే లక్షకి పైగా ఆదాయం వస్తుంది. కోళ్ల వ్యాపారంపై మాత్రమే కాకుండా నాకు వేరే పనులపై కూడా శ్రద్ధ పెట్టే సమయం ఉంటుంది” అని అన్నారు. నిజంగా ఐడియా చాలా డిఫరెంట్ గా రొటీన్ కి కొంచెం భిన్నంగా ఉంది కదా?
End of Article