రోడ్ సైడ్ పిల్లలకోసం ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..! (వీడియో)

రోడ్ సైడ్ పిల్లలకోసం ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..! (వీడియో)

by Anudeep

Ads

కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది మన క్యారెక్టర్ ని తెలియచేస్తుంది. మనం చేసే చిన్న పని అయినా మానవత్వం తో చేస్తే అది అందరి మన్నన ను పొందుతుంది. హైదరాబాద్ పంజాగుట్ట పరిధి లోని ట్రాఫిక్ పోలీస్ సిరుపంగి మహేష్ కుమార్ రోజులానే డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆరోజు రోడ్ సైడ్ లో కొందరు పిల్లలు ఫుడ్ కోసం చెత్త కుండీల్లో వెతుక్కోవడం గమనించాడు.

Video Advertisement

punjagutta police

వారిని పిలిచి కూర్చోపెట్టి తన కోసం తెచ్చుకున్న క్యారేజ్ ను వారి ఆకలి తీర్చడం కోసం పెట్టాడు. ఇది సిసి కెమెరా లో రికార్డు అయింది. ఈ వీడియో ను సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో పంచుకోగా.. నెటిజెన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న పని అయినా.. ఆ ట్రాఫిక్ పోలీస్ మంచి హృదయానికి అందరు మెచ్చుకుంటున్నారు.


End of Article

You may also like